ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది.