prorogue
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అసెంబ్లీని "ప్రోరోగ్" చేసిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలను రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ "ప్రోరోగ్" చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉభయ సభల 6వ సెషన్ సమావేశాలు గతేడాది డిసెంబర్ 16వ తేదీన ప్రారంభమయ్యాయి. కాగా, సమావేశాలు 18 రోజులపాటు కొనసాగి ఈ నెల 18న ముగిశాయి. అయితే, 27వ తేదీ నుంచే సమావేశాలు ప్రోరోగ్ అయ్యాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అసెంబ్లీని ప్రొరోగ్ చేయొద్దు.. గవర్నర్‌కు టి.మంత్రుల వినతి
తెలంగాణ బిల్లు త్వరలో శాసనసభకు రానున్న సమయంలో అసెంబ్లీని నిరవధికంగా వాయిదా(ప్రొరోగ్) వేయవద్దని ఆ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించాలన్న ప్రయత్నాల్ని ఆమోదించరాదని విన్న వించారు. మంగళవారం మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజ్ సారయ్య గవర్నర్‌తో భేటీఅయ్యూరు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి టీ-బిల్లు రాగానే అసెంబ్లీని సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణను వెంటనే పూర్తిచేయించి బిల్లు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. -
ప్రొరోగ్ వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్ వివాదం ముగిసింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ సంబంధిత పత్రాలను శనివారం ప్రభుత్వానికి పంపారు. మండలిని కూడా ప్రొరోగ్ చేస్తూ చైర్మన్ చక్రపాణి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రొరోగ్ అంశం సీఎం-స్పీకర్ వివాదంగా మారి తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆర్డినెన్సుల జారీకి అడ్డంగా ఉందనే కారణంతోనే అసెంబ్లీని పొరోగ్ చేయాలంటూ లేఖ రాసినట్టు వివరించాయి. వివాదం సద్దుమణగడంతో ప్రొరోగ్ లేఖలను చైర్మన్, స్పీకర్ శనివారం ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. అయితే స్పీకర్ పంపిన ప్రొరోగ్ లేఖ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా సీఎంఓకు, అక్కడి నుంచి గవర్నర్‌కు చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రొరోగ్తో అనుమానాలు: శ్రీధర్‌బాబు శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున సభను ప్రొరోగ్ చేయడం వల్ల అనేక సందేహాలు నెలకొనే అవకాశాలున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్ల అపోహలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దని గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానించే విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఆధార్ పొందటం వల్ల అన్ని విధాలా ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు. -
సీఎం కిరణ్ ఎత్తుగడ వికటించిందా?