తెలంగాణ బిల్లు త్వరలో శాసనసభకు రానున్న సమయంలో అసెంబ్లీని నిరవధికంగా వాయిదా(ప్రొరోగ్) వేయవద్దని ఆ ప్రాంత మంత్రులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయించాలన్న ప్రయత్నాల్ని ఆమోదించరాదని విన్న వించారు.
మంగళవారం మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజ్ సారయ్య గవర్నర్‌తో భేటీఅయ్యూరు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి టీ-బిల్లు రాగానే అసెంబ్లీని సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరామన్నారు. అసెంబ్లీ అభిప్రాయ సేకరణను వెంటనే పూర్తిచేయించి బిల్లు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.