తెలంగాణ అసెంబ్లీ.. మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌ | Telangana Assembly Session On 1st August Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌

Published Thu, Aug 1 2024 8:41 AM | Last Updated on Thu, Aug 1 2024 3:20 PM

Telangana Assembly Session On 1st August Live Updates

Updates..

తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా.

‍👉స్కిల్‌ యూనివర్సిటీపై చర్చ..

సీఎం రేవంత్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌..

  • నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు.
  • అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?.
  • వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నాను.
  • సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దు.
  • వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్‌ జైలులో ఉంది.
  • సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారు.
  • వాళ్లను సొంత అక్కల్లాగే భావించాను.
  • ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లింది.
  • మరో అక్క కోసం ప్రచారానికి వెళ్లే నాపై కేసులు నమోదయ్యాయి.
  • దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారు.
  • దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలి.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు.

  • సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను ఎత్తుకొని బయటకు తీసుకువచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు
  • సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
  • కేటీఆర్ కామెంట్స్‌..
  • సీఎం మొండి వైఖరీ అహంకార వైఖరీ మార్చుకోవాలి.
  • వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

 

  • సీఎం ఛాంబర్ ముందు నిలబడి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
  • సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మి.
  • మహిళ ఎమ్మెల్యేలను లిఫ్టింగ్ చేస్తున్న మహిళ పోలీసులు.
  • వెహికల్ సిద్దంగా ఉంచిన పోలీసులు.
  • కాసేపట్లో సబిత ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీ, సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్.
  • తెలంగాణ భవన్‌కు తరలించనున్న పోలీసులు.

 

సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

  • ఐటీ రంగ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
  • ఏ దేశానికైనా సాంకేతిక నిపుణులు కావాలి.
  • హైదరాబాద్‌లో ఐటీ రంగానికి రాజీవ్‌గాంధీ పునాదులు వేశారు.
  • రాజీవ్‌ హయాంలోనే మాదాపూర్‌లో ఐటీ సంస్థలు ప్రారంభమయ్యాయి.
  • దేశ, విదేశాల్లో యువత ఐటీ రంగంలో సత్తా చాటుతున్నారు.
  • అత్యున్నత సంస్థల్లో తెలుగువారు ఉండటం గర్వకారణం.
  • స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు ఎంతో గొప్ప ఆలోచన.
  • గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశాయి.
  • అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్‌ పార్టీనే.
  • గాంధీజీ స్పూర్తితోనే స్కిల్‌ యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం.
  • విద్యకు పెద్దపీట వేస్తున్నాం.
  • గ్రామీణ ప్రాంతాల్లో యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నాం. 
     

👉అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ.

👉 అసెంబ్లీ వద్ద గందరగోళం.. 

  • అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ లోపలికి వచ్చే ప్రాంతంలో మోహరించిన పోలీసులు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
  • అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైటాయింపు.
  • సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

👉సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానిస్తామంటున్న నేతలు..

👉హరీష్ రావు కామెంట్స్‌.. 

  • ప్రతిపక్షం తరుపున ఎవరు మాట్లాడాలనేది మేము నిర్ణయించి చెప్తాం.
  • అందుకు అనుగుణంగా సభలో మీరు అవకాశం ఇవ్వాలి.
  • కానీ మీరు కొత్త సంప్రదాయం నెలకొల్పుతున్నారు.
  • ఇది కౌరవ సభ లాగా నడుస్తుంది.
  • అంతిమంగా పాండవులే గెలుస్తారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్తారు.
  • నిన్న, ఈరోజు  సభ జరిగిన తీరు మా హృదయాలను కలిచి వేసింది.
  • ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలపై సీఎం మాటలు బాధరకం
     

👉సభలో కొనసాగుతున్న గందరగోళం.

  • ఉదయం నుంచి సభలో కింద కూర్చొని నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
  • ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం.: సీఎం రేవంత్
  • ఇది ప్రధానమైన అంశం.
  • ఇంత పెద్ద అంశం మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఉండి మాట్లాడాలి.
  • లేదంటే వారి వారసులు ఎవరు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు: సీఎం రేవంత్.

 

👉కేటీఆర్‌ కామెంట్స్‌..

  • ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.
  • ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.
  • మా పార్టీ అధినేత కేసీఆర్ సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు

 

👉సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కామెంట్స్‌..

  • రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పరిపాలించిన బీఆర్ఎస్ సభ్యులు సభలో కింద కూర్చోవడం బాధాకరం
  • సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రా రెడ్డికి అక్క, తమ్ముళ్ల అనుబంధం ఉంది
  • సమస్యను స్పీకర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటే మంచిది
  • సభ్యుడిగా నేను సూచన చేస్తున్న
  • మహిళలను గౌరవించే వ్యక్తులలో మొదటి వ్యక్తిని నేను
  • ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం
  • ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు
     

 

  • అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్‌ సభ్యుల ఆందోళన.
  • ఎమ్మెల్యే సబితకు సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌.
  • బీఆర్‌ఎస్‌ ఆందోళన వర్గీకరణకు వ్యతిరేకంలా ఉంది: కడియం శ్రీహరి
  • ప్రతీ ఒక్కరూ తీర్పును గౌరవించాలి.
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం.
  • మీ పద్దతి సరిగా లేదు. 
     

👉సీఎం రేవంత్‌ కామెంట్స్‌..

  • సుప్రీంకోర్టు తీర్పుపై సభలో స్పందించిన సీఎం రేవంత్‌
  • ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై ముందుకెళ్తాం.
  • తెలంగాణలో వర్గీకరణను అమలు చేస్తాం.
  • ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుపరుస్తాం. 
     

👉అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్‌..

  • ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది.
  • వారికి మైక్ ఇవ్వండి.
  • వాళ్ళు ఆందోళన, నినాదాలు చేస్తుంటే అసెంబ్లీ కొనసాగడం ప్రజాస్వామ్య విధానం కాదు.
  • వాళ్లకు మైక్ ఇవ్వండి.. లేదా సస్పెండ్ చేయండి

 

👉మంత్రి శ్రీధర్ బాబు సీరియస్‌

  • సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు.
  • పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?.
  • నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు..
  • కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు.
  • స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు.
  • యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా.


👉 బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

  • స్కిల్ యూనివర్శిటి బిల్లును స్వాగతిస్తున్నాం  
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
  • స్కిల్ యూనివర్సిటీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి
  • కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా SC, ST లకు 12 లక్షలు, BCలకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

 

👉సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు. 

👉 బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం 

👉స్పీకర్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.

👉మా ఆవేదనను అర్దం చేసుకున్నారు స్పీకర్.

👉మేము నల్ల బ్యాడ్జీలు ధరించాం.

👉మీరు నల్ల డ్రెస్సు వేసుకొని వచ్చారంటూ సభలో మాట్లాడిన  హరీష్ రావు

👉సభలో బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌ 

👉బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ హెచ్చరిక.

👉అన్ పార్లమెంటరీ పద్దతిలో వ్యవహరిస్తే మైక్ ఇవ్వను..

👉ఇష్టారీతిన వ్యవహరిస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా..
 

మం‍త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్‌

  • బీఆర్ఎస్ సభ్యులకు రాజకీయాలు తప్ప.. సభ నడవాలని లేదు.
  • నిరుద్యోగుల గురించి ఏనాడూ కేటీఆర్ ఆలోచించలేదు.
  • ప్రభుత్వ ఉధ్యోగాలే కాదు.. ప్రైవేటు రంగంలో స్థిరపడేందుకు స్కిల్ యూనివర్సిటీ.
  • కేసీఆర్ మహిళా వ్యతిరేకి
  • నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే.. ఇలాంటి రాజకీయాలు మానుకోండి. 
  • మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదు. 
  • ఐదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. 

 

👉ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

👉సభలో బీఆర్‌ఎస్‌ నేతల నినాదాలు.

👉బీఆర్‌ఎస్‌ నేతలపై స్పీకర్‌ ఆగ్రహం.

👉సభా నాయకుడి రాగానే ఆందోళన చేయడం సరికాదన్న స్పీకర్

 

👉స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌ బాబు.

👉రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీని ప్రారంభించామన్న శ్రీధర్‌ బాబు. 

👉సభ ముందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు.

👉నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. 

బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

  • నిన్న శాసనసభలో సీఎం రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ మహిళా శాసన సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు.
  • గౌరవ సభ్యులు, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి.
  • ఈ అంశంపై చర్చకి వాయిదా తీర్మానం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబిత కామెంట్స్‌..

  • మా వాళ్ళని ఉదయం 5 గంటల నుంచి అరెస్టులు చేస్తున్నారు.
  • ఇదేనా మీరు తెచ్చిన ప్రజాపాలన.
  • ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటే మేము ఎందుకు ఆపుతాం.
  • వారిలాగా సంస్కారం లేని వాళ్లం కాదు.
  • మాకు ఎలాగూ అసెంబ్లీలో మైక్ ఇవ్వరు మాట్లాడటానికి.
  • ఇక్కడ కూడా మాట్లడినివ్వరా?.


ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కామెంట్స్‌..

  • రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా?.
  • ప్రజలకు సంక్షేమం చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదా?.
  • సభను తప్పుదారి పట్టించే విధంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించారు.
  • వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని సబితకు తెలియదా?.
  • రాష్ట్ర మహిళలను అగౌరపరిచినట్లుగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తోంది.
  • ప్రతీ మహిళలను ఇందిరమ్మలా కాంగ్రెస్ చూస్తుంది.
  • గతంలో కేసీఆర్‌ను విమర్శించిన విషయాన్ని సబిత మర్చిపోయారా?.
  • మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు.
     
  • కాసేపట్లో ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  • నల్లబ్యాడ్జీలతో నిరసన చెబుతూ లాబీ నుంచి అసెంబ్లీలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు

బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

  • బుధవారం శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మహిళ శాసన సభ్యుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలు
  • గౌరవ సభ్యుల, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వున్నాయని చర్చకి వాయిదా తీర్మానం

 

ఈరోజు సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగా, నేటి సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఏడో వార్షిక రిపోర్టు సాంప్రదాయ ఇంధనం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను టేబుల్ చేయనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ రెండో వార్షిక నివేదికను టేబుల్ చేయనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఈరోజు మూడు  బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

1. తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్‌మెంట్‌ బిల్లు.

2. తెలంగాణ లా డిపార్ట్మెంట్ (ఛేంజ్‌ ఆఫ్ ఆక్రోనేమ్స్)బిల్లు.

3. తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement