
మార్చిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు?
హైదరాబాద్: మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మాట్లాడుతూ..16 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
చిట్ ఫండ్ మోసాల నియంత్రణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలని యనమల తెలిపారు.