విజయవాడ : రాష్ట్రంలో గ్రోత్ రేట్ 12.6 శాతానికి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దేశ సగటు కంటే అధికంగానే ఉందన్నారు. శనివారం విజయవాడలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ఏపీ తలసరి ఆదాయం రూ. లక్షా 7 వేలకు పెరిగిందని చెప్పారు. హోల్సేల్ ధరలు, వినియోగదారుల ధరల మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని చెప్పారు.
దీని వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. దివీస్ పరిశ్రమను మా ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మెజారిటీ రైతులు అనుకూలంగా ఉన్నారని... కొందరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే కలెక్టర్ చూసుకుంటారని యనమల తెలిపారు.