సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల అభ్యర్థన మేరకు 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు విరామం ఇచ్చారు. మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వినతిని స్పీకర్ అనుమతిస్తూ పాలక, ప్రతిపక్షాల ఆమోదంతో 30న శనివారం సభా వ్యవహారాలు ఉండవని ప్రకటించారు. దీంతో సభకు శుక్ర. శని, ఆదివారాలు.. వరుసగా మూడు రోజులు సెలవు వచ్చినట్టయింది.