Legislators
-
Latha Mangipudi: హ్యారిస్ గెలిచి మహిళాశక్తిని గెలిపిస్తుంది
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి. మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.స్త్రీల హక్కులకు విఘాతం‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే. కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.ఇంకా వివక్షేనా....‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.– పగిడిపాల ఆంజనేయులుసాక్షి, హైదరాబాద్ -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
సుపరిపాలనకు సమష్టిగా కృషిచేయండి
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీ సమావేశాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండు ఆర్డినెన్సులు.. తెలంగాణ హౌజింగ్ బోర్డు ఆర్డినెన్స్ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ 2021ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్‌రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. తొమ్మిది మందికి నివాళి ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది. శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కొత్త సభ్యులతో మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహ్మాన్, ఆర్.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు. -
ఆ విషయంలో వెనుకబడ్డ చట్టసభ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవడంలో చట్టసభల సభ్యులు వెనకబడి ఉన్న ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యవసర కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వేగంగా జరపాలనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం విడుద ల చేస్తున్న ఏసీడీపీ నిధుల్లో సగం మేర ఖజానాలోనే మూలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపీ ల్యాడ్స్ తరహాలో క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ వినియోగం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడంలేదు. ఒక్కో సభ్యుడికి ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా... వీటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. (చదవండి: బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. ) ఐదేళ్లలో 1,900 కోట్లు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2018–19 వార్షిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏసీడీపీ నిధుల కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేశారు. అంటే విడుదల చేసిన నిధులలో కేవలం 64.66 శాతం మాత్రమే ఖర్చు చేయగా.. మిగతావన్నీ ఖజానాలో మూలుగుతున్నాయి. ఖర్చు కాని నిధులను క్యారీఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సకాలంలో వీటిని వినియోగించకపోవడంతో ఆశిం చిన ప్రయోజనం కలగడం లేదు. ఎమ్మెల్యేలు కాస్త నయం... ఏసీడీపీ కార్యక్రమం కింద విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్యేలు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే కోటాలో ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు రూ.974.85 కోట్లు (67.69 శాతం)ఖర్చు చేశారు. ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల చేస్తే ఇప్పటివరకు రూ.254.08 కోట్లు (55.17శాతం)మాత్రమే ఖర్చు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువ నిధులు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) -
చట్టసభల్లో ‘సింహ’గళం
సాక్షి , నెల్లూరు : రాష్ట్ర అసెంబ్లీలో సింహపురి గళం బలంగా వినిపించింది. పార్లమెంట్లో జిల్లా నుంచి ఎన్నికైన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి అనిల్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహం ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెంనాయుడు మాట్లాడిన మాటలకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ జవాబు ఇస్తూ టీడీపీ ఐదేళ్ల పాలనపై, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై ఘాటుగా విమర్శించారు. నీరు లేకుండా చెట్టు లేకుండా రూ.18 వేల కోట్లు చంద్రబాబు, ఆయన సహచర మంత్రులు దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌లను విస్మరించారంటూ ధ్వజమెత్తారు. 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిలను ఏనాడు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసిన పాపాన పోలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే సోమశిల ముంపు గ్రామాలైన వైఎస్సార్ జిల్లాలోని బాధితులకు పరిహారం ఇచ్చి 78 టీఎంసీల నీటిని నిల్వ చేయించిన అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన సంగం, పెన్నా బ్యారేజీలను 2014లో సీఎం అయిన చంద్రబాబు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చినా.. ఐదేళ్లలో అడుగు ముందుకు వేయలేదంటూ దుయ్యబట్టారు. కుటుంబ హత్యలను రాజకీయ హత్యలుగా ప్రచారమా? ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్లలో జిల్లాకు చేసిందీ ఏమీ లేదని విమర్శించారు. వరుసగా ఓడిపోయిన చంద్రమోహన్‌రెడ్డిని అడ్డదారిలో మంత్రిని చేసి నిత్యం తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించాలని ఆయనకు పని కల్పించారన్నారు. టీడీపీ కార్యకర్తల్ని చంపేస్తున్నారని చంద్రబాబు గోల చేస్తున్నారని,, సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో చేవూరు శ్రీనివాసులు అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. అయితే ఆయన హత్యకు కారణం వివాహేతర సంబంధం అని అన్ని పత్రికల్లో ప్రచురితమైన పేపర్లను సభలో చూపించి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు మాట్లాడే ముందు కనీసం సరిగ్గా చూసుకోకపోవటం ఏంటని ప్రశ్నించారు. బాబును ఏయిర్ పోర్టులో భద్రతా దళాలు తనిఖీలను నేరంగా చూపించేలా మాట్లాడటం సరికాదని ఘాటుగా విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆఖరికి ఆయన కుమారుడుకి రెండు ఉద్యోగాలు.. మూడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. జాబుల కోసం చంద్రబాబు మాటలు విని ఉమ్మడి కుటుంబాలు సైతం విడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం దేశ రాజధానిలో ఢిల్లీలోని పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమ జరిగింది. నెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాద్ మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, బల్లి దర్గాప్రసాద్ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకరాం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు కొందరు ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఎంపీలకు మాట్లాడే అవకాశం రానుంది. -
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల పూర్తి వివరాలను తమకు సమర్పించాలని 25 రాష్ట్రప్రభుత్వాలను, హైకోర్టులను, కేంద్రపాలిత రాష్ట్రాలను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసుల విచారణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులకు వాటిని బదిలీచేయాల్సి ఉందని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్ వ్యాఖ్యానించింది. 11 రాష్ట్రాల్లో ఇప్పటికే 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు పూర్తయిందని, కేసుల వివరాలన్నీ అక్టోబర్ 10కల్లా ఆ కోర్టులకు చేరాల్సి ఉందని బెంచ్ తెలిపింది. వివరాలు సమర్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హైకోర్టుల రిజిస్ట్రార్స్ జనరల్స్‌దే అని బెంచ్ స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు 25 కేసులు బదిలీ అయ్యాయని కేంద్రం గతంలో తన అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఇవిగాక మరెన్ని కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నాయో తేల్చాలని పిటిషనర్ సుప్రీం బెంచ్‌ను కోరడంతో అన్ని రాష్ట్రాలకూ కోర్టు ఆదేశాలిచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాల దాఖలు నాటికి వీరందరిపై దేశవ్యాప్తంగా 1,581 కేసులున్నాయని కేంద్రం గతంలో తెలిపింది. -
‘అసెంబ్లీకి వాస్తు దోషం ఉంది’
భోపాల్ : వాస్తు, గ్రహదోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని విపరీతంగా విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఇటువంటి వారు అధికంగానే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందని.. అందువల్లే ప్రజాప్రతినిధులు అర్థాంతరంగా మరణిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే శాసనసభ భవానికి వాస్తు శాంతి చేయించాలని ఆయన పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు హఠాత్తుగా మృతి చెందారని కేపీ సింగ్ చెప్పారు. ప్రస్తుత సభకు ఇంకా ఏడాది కాలపరిమితి ఉన్న నేపథ్యంలో.. ప్రకృతి మరిన్ని ప్రాణాలను కోరుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభకు రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుత విధాన సభకు శాస్త్రప్రకారం వాస్తు పూజ చేసి, ఇతర దోష నివారణ చర్యలు చేపట్టాలని కేపీసింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. 1993 నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందనే వాదనలు బలంగా విపిస్తున్నాయి. -
‘మాకు సగం సీట్లు రిజర్వు చేయండి’
పట్నా(బిహార్): చట్టసభల్లో తమకు యాబై శాతం సీట్లు కేటాయించాలంటూ బిహార్ మహిళా శాసనసభ్యులు పట్టుబట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం శాసనసభ సమావేశమైంది. పాల్గొన్న మహిళా ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సభలో లేచి నిలబడి ఈ మేరకు నినాదాలు చేశారు. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారని, అందుకే పార్లమెంట్, రాష్ట్ర చట్టసభల్లో సగం సీట్లు రిజర్వు చేయాలని డిమాండ్ చేశారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ రాష్ట్ర స్థానిక సంస్థలు, పంచాయతీల్లోని సగం సీట్లను మహిళలకే రిజర్వు చేస్తూ ఇటీవల చట్టం కూడా చేశారు. ఈ విషయాన్ని పలువురు మహిళా సభ్యులు ప్రస్తావిస్తూ రాష్ట్ర, కేంద్ర చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ విషయమై స్పీకర్ విజయ్‌కుమార్ చౌధురి మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల డిమాండ్‌కు మద్దతు పలికారు. దీనిపై ముందుగా పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉందని తెలిపారు. తమ నియోజకవర్గాల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. -
ఎమ్మెల్యేలకు ఖరీదైన యాపిల్ ఫోన్..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ్యులందరీకి ఖరీదైన ‘యాపిల్ ఐఫోన్ 6 ప్లస్’ సెల్ఫోన్లు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం సభలో ప్రకటించారు. బహుమతులను శాసనసభ సచివాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎమ్మెల్యేలు స్వయంగా సంతకం పెట్టి తీసుకోవాలని సూచించారు. ఖరీదైన సెల్‌ఫోన్‌తో పాటు తిరుమల ప్రసాదం, అరకు కాఫీ పొడిని కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. -
సంస్థాగతమే ప్రధాన ఎజెండా!
► నేడు టీఆర్ఎస్ శాసనసభాపక్షం, ఎంపీల భేటీ ► హాజరు కానున్న గులాబీ అధినేత కేసీఆర్ ► పలు కీలకాంశాలపై చర్చించే అవకాశం ► నామినేటెడ్ పదవుల పంపకంపైనా సమీక్ష సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీలో ‘సంస్థాగత’ సందడి మొదలైంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. గత ఏడాది ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అంతకు ముందే ఆయా జిల్లాల్లో అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇది జరిగి ఏడాది కావొస్తున్నా పార్టీ సంస్థాగత కమిటీలను మాత్రం నియమించలేదు. అధికారిక పదవులు కాదు కదా, కనీసం పార్టీ పదవులు కూడా లేకుండా పోయాయన్న ఆవేదన పార్టీ నాయకుల్లో వ్యక్తమైంది. వరుసగా వచ్చిన ఎన్నికల వల్ల పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టిపెట్టలేదన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తమయ్యింది. దీంతో పాటు ప్రభుత్వం నియమించాల్సిన ‘నామినేటెడ్ ’ పదవుల పంపకమూ జరగలేదు. మరో నెల రోజుల్లోనే పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం 3 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. -
ముసలం మొదలు
- 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది - వెనక్కు తగ్గని కాంగ్రెస్ నేత ఏఎస్ పాటిల్ సాక్షి, బెంగళూరు : దేవర హిప్పర్గి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత ఏఎస్ పాటిల్ నాడహళ్లి వెనక్కు తగ్గడం లేదు. తన అడుగుజాడల్లో నడవడానికి ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన 35 మంది శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారని రాజకీయ బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు స్వపక్ష పాలనా విధానంపై నాడహళ్లి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను సీఎల్పీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన్ను ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచే తొలగించడానికి కేపీసీసీ అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వెలువుడుతున్నాయి. ఈ క్రమంలో నాడహళ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీదర్‌లో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో ప్రకటించిన ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకూ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అమలు కాలేదన్నారు. ‘‘సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడానికి ఉత్తర కర్ణాటక భాగంలోని 65 మంది ఎమ్మెల్యేలు కారణం. నన్ను సీఎల్పీ నుంచి బహిష్కరించినా నాకు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఆయనతోపాటు కేపీసీసీ గుర్తిస్తే మంచిది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి జరుగుతున్న అక్రమాలపై ప్రజలను జాగృతం చేస్తానని నాడహళ్లి స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
సాక్షి, ముంబై: ‘‘ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్నాయి. పట్టపగలే నేరాలు జరుగుతున్నాయి. పోలీసుల ఇళ్లలో మాద కద్రవ్యాలు దొరుకుతున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అని మాజీ ముఖ్యమంత్రి అజీత్ పవార్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పవార్ నిలదీశారు. ఇటీవల హత్యకు గురైన కమ్యునిస్టు సీనియర్ నేత గోవింద్ పాన్సరే హంతకులు ఇంతవరకు పట్టుబడలేదని, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, రాష్ట్ర ఉప రాజధాని, ఫడ్నవీస్ నియోజకవర్గమైన నాగపూర్‌లో సైతం నేరాలు అధికమవుతున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నేరాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫడ్నవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవార్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మోడీకి ముస్లింలు కూడా ఓటు వేశారనే విషయం గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ధన్గర్ సమాజానికి ఇచ్చిన హామీ నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై విమర్శల వర్షం గవర్నర్ ప్రసంగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోందని, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తన ప్రసంగంలో ఏమాత్రం ఫ్లూ గురించి ప్రస్తావించలేదన్నారు. శివాజీ పేరు చెప్పుకుని ఓట్లడిగిన బీజేపీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన స్మారకం నిర్మించే ఊసే ఎత్తడం లేదన్నారు. ఆర్.ఆర్.పాటిల్ వృుతితో ఖాళీ అయిన తాస్గావ్ శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా చూడాలని ఈ సందర్భంగా అన్ని పార్టీలను కోరారు. ఠాక్రేను మర్చిపోకండి ముంబై: శివసేన సుప్రీం బాల్‌ఠాక్రే సహకారాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మర్చిపోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో పవార్ మాట్లాడుతూ.. ఠాక్రేకోసం ప్రతిపాదించిన స్మారకం గురించి ప్రభుత్వం మాట్లాడలేదని విమర్శించారు. గో వధ గురించి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న పశువులకోసం ప్రభుత్వం రైతులకు ఏం చేయబోతోందని ప్రశ్నించారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఠాక్రే స్మారకం నిర్మాణానికి తమకు పవార్ సిఫార్సు అవసరం లేదన్నారు. ముంబైలో ఠాక్రే కోసం అద్భుతమైన స్మారకాన్ని నిర్మిస్తామన్నారు. ఎన్నికల ముందు బీజేపీ-శివసేన పొత్తు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఠాక్రే సహకారం తమకు గుర్తుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో శివాజీ స్మారకం గురించి ప్రస్తావించలేదన్న ప్రతిపక్ష మాటలకు స్పందిస్తూ..పదిహేనేళ్లుగా స్మారకం గురించి తాము ప్రస్తావిస్తున్నామన్నారు. -
గులాబీ దళంలో నూతనోత్సాహం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గులాబీ పార్టీ బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీకి నలుగురు శాసనసభ్యులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. తెలంగాణలో అధికారం చేపట్టి ఊపుమీదున్న ఆ పార్టీ క్రమంగా ప్రతిపక్షాలను బల హీనం చేసేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ‘ఆకర్ష్’ మంత్రానికి తెరలేపింది. ఆ మంత్రానికి ఆకర్షితులై ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తాజాగా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అభివృద్ధి కోసమంటూనే.. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో నిధులు ఎక్కువ రాబట్టేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాలె యాదయ్య ప్రకటించారు. ఆదివారం కేసీఆర్ సమక్షంలో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మారిన యాదయ్య తన మాజీ పార్టీ నేతలకు చురకలంటించారు. గతంలో మంత్రులుగా పనిచేసి చక్రం తిప్పిన నేతలు ప్రస్తుతం జిల్లాను పట్టించుకోవడంలేదని విమర్శించారు. చేవెళ్లకు భారీగా నిధులివ్వాలని సీఎంను కోరగా.. ఆయన స్పందిస్తూ వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా ఉద్యాన సాగుకు ప్రోత్సహిస్తామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అక్కడ హంగామా.. ఇక్కడ మూగనోము.. కాలె యాదయ్య టీఆర్ఎస్లో చేరడంపై ఆయన వర్గంలో నూతనోత్సాహం కనిపించింది. ఆయనతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడిన పలువురు నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులైన వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు వివరించగా.. ఆయన అప్పట్లో సర్ది చెప్పి పంపారు. తాజాగా ఆదివారం యాదయ్య చేరిన సమయంలోనూ తమకు ఆహ్వానం లేదంటూ రత్నం వర్గీయులు దూరంగా ఉన్నారు. ఒకవైపు బలం పెరుగుతుండడంతో ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్కు తాజా చేరికలు ఏమేరకు కలిసివస్తాయో వేచి చూడాల్సిందే. -
కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ!
నంద్యాల టౌన్: టీడీపీ బనాయించిన అక్రమ కేసులో జైలు పాలైన వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానుల కుటుంబ సభ్యులకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కొండంత ఓదార్పునిచ్చారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఇలాంటి కుట్రలు కొట్టుకుపోతాయని.. న్యాయం తప్పక గెలుస్తుందనే భరోసానిచ్చారు. అత్యంత చిన్న వయస్సులో శాసనసభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ఎమ్మెల్యే, తన తల్లి శోభా నాగిరెడ్డిని తలపిస్తూ బాధిత కుటుంబాల్లో సభ్యురాలిగా కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లోనే కాకుండా ప్రజల మనిషిగా తనదైన శైలిని కనబరిచే నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డి బాటలో అఖిలప్రియ అందరికీ అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడం విశేషం. శనివారం సాయంత్రం ఆమె నంద్యాల సబ్‌జైలులోని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు శివశంకర్, దిలీప్‌కుమార్, కరీముల్లా, పార్టీ నేతలు ఏవీఆర్ ప్రసాద్, వడ్డె శీను, వడ్డెమనోజ్, దేవనగర్ మధు, చంటి, అజ్మీర్‌బాషా తదితరులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఇళ్ల వద్ద కలుసుకుని ఓదార్చారు. భూమాపై కేసు సులోచన అహంకారానికి నిదర్శనం సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భూమా నాగిరెడ్డిపై బనాయించిన కేసు మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అహంకారానికి నిదర్శనమని కౌన్సిలర్ శివశంకర్‌యాదవ్ తల్లి శివమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల ప్రియ.. శివశంకర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా శివమ్మ పైవిధంగా స్పందించారు. భూమాతో కలిసి తన కుమారుడు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా జైలుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. భూమాను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసు బనాయించారన్నారు. అక్కా.. నాన్నను చూపించవా ‘అక్కా.. నాన్నను చూసి చాలా రోజులైంది. ఒక్కసారి చూపించవా..’ అంటూ దేవనగర్ మధు కుమారుడు శ్రీనివాస్ ఏడుస్తూ అఖిల ప్రియను హత్తుకున్నాడు. జైలులో ఉన్న దేవనగర్ మధు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ఆమె వారింటికి వెళ్లారు. తండ్రిని చూడాలనిపిస్తుందంటూ శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె చలించిపోయారు. వీలైనంత త్వరగా మీ నాన్నను మీ వద్దకు తీసుకొస్తానంటూ అఖిలప్రియ భరోసానిచ్చారు. మధు భార్యకు కూడా ధైర్యం చెప్పారు. ప్రజల కోసమే జైలుకు వెళ్లారు సబ్‌జైలులోని దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులను అఖిల ప్రియ పరామర్శిస్తూ.. ప్రజల కోసమే తన తండ్రితో పాటు మరికొందరు జైలుకు వెళ్లారన్నారు. అధికార పార్టీ కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయించిందన్నారు. అయితే ఈ కేసులు కోర్టులో నిలబడవన్నారు. నాలుగైదు రోజుల్లో బెయిల్ వస్తుందని.. అంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు. కంటతడి పెట్టిన శశిరేఖ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఏవీఆర్ ప్రసాద్ భార్య, కౌన్సిలర్ శశిరేఖ కంటతడి పెట్టారు. భూమా అఖిలప్రియ ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లగా.. ‘‘తన భర్త ప్రసాద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని, ఎవరినీ దూషించేవారు కాదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల ప్రియ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని.. ప్రజల మద్దతుతో అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామన్నారు. అచ్చం అమ్మలాగే ఉన్నావ్.. ‘‘అమ్మా.. నీవు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావ్..’’ అంటూ అఖిల ప్రియను శోభానాగిరెడ్డితో పోల్చారు కొండారెడ్డి కుటుంబ సభ్యులు. కొండారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్లిన సమయంలో వారు ఆవిధంగా స్పందించారు. నిన్ను చూస్తే మాకెంతో ధైర్యం వస్తోందని చెప్పడం విశేషం. చట్టపరంగా పోరాటం అధికార పార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడబోమని భూమా అఖిల ప్రియ అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న రోడ్ల విస్తరణ, పందుల నిర్మూలన ఇతరత్రా సమస్యలపై భూమా నాగిరెడ్డి రాజీలేని పోరాటం సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గత నెల 31న కౌన్సిల్ హాల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా.. చైర్మన్ దేశం సులోచన అడ్డుకుని వివాదానికి తెర తీశారన్నారు. తన తండ్రి ప్రమేయం లేకపోయినా అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇదే సమయంలో చైర్మన్‌పై అట్రాసిటీ కేసు నమోదైనా పోలీసులు అరెస్టుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెగా నంద్యాల ప్రజలకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి పోరాటం సాగిస్తానన్నారు. -
30న అసెంబ్లీకి సెలవు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల అభ్యర్థన మేరకు 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు విరామం ఇచ్చారు. మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వినతిని స్పీకర్ అనుమతిస్తూ పాలక, ప్రతిపక్షాల ఆమోదంతో 30న శనివారం సభా వ్యవహారాలు ఉండవని ప్రకటించారు. దీంతో సభకు శుక్ర. శని, ఆదివారాలు.. వరుసగా మూడు రోజులు సెలవు వచ్చినట్టయింది. -
‘వెలిగొండ’పై వైఎస్సార్సీపీ గళం
ఒంగోలు అర్బన్ : జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో వైఎస్సార్ సీపీ శాసన సభ్యులు తమ వాణి వినిపించారు. సమావేశాలు గురువారం మొదలై జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను అభినందిస్తూ మాట్లాడే అవకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలకు లభించింది. వారిలో వైఎస్సార్సీపీ నుంచి యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి ఉన్నారు. తొలుత స్పీకర్‌గా ఎంపికైన డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావును అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పశ్చిమ ప్రాంతం ప్రజల కష్టాలు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితేనే తీరుతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని గుర్తుచేశారు. సభాపతి గతంలో భారీ నీటిపారుదల శాఖామాత్యులుగా పనిచేశారని వారికి వెలిగొండ ఆవశ్యకత తెలుసని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పీకర్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తాగు, సాగునీటి సమస్య తీరి పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. -
ఏపీ శాసనసభ సమావేశాలు
-
శాసనసభ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయంగా తల పండిన నేతలతో పోటీపడి గెలుపొందిన ఎనిమిది మంది కొత్త శాసనసభ్యులు మొదటి సారిగా నేడు అసెంబ్లీలో అడుగిడనున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెండోసారి తమ ముచ్చట తీర్చుకోనుండగా.. ఇద్దరు మాత్రం అనుభవజ్ఞులు కావడం విశేషం. టీడీపీ తరఫున ఇరువురు కొత్త శాసనసభ్యులు శాసనసభ మెట్లెక్కనున్నారు. వీరంతా గురువారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారి నియోజకవర్గాల్లో తిష్ట వేసిన సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చూపడం ద్వారా శభాష్ అనిపించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అయితే ఈ విడత శాసనసభ సమావేశాలు ఐదు రోజులే నిర్వహిస్తుండటంతో సమస్యలపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుణుడు ఊరిస్తున్న నేపథ్యంలో రైతులను విత్తనాలు, ఎరువుల కొరత వేధిస్తోంది. మరీ ముఖ్యంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతు రుణమాపీ, బంగారంపై తీసుకున్న రుణాల మాఫీలపై అధికారంలోకి రాగానే ఆ పార్టీ మెలిక పెట్టడం అన్నదాతను కలవరపరుస్తోంది. కమిటీ పేరిట కాలయాపన చేయడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక.. బ్యాంకర్లు రుణాలు ఇవ్వక వీరిలో అయోమయం నెలకొంది. కొందరు రైతులు అధిక వడ్డీతో అప్పులు చేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. అవకాశం వస్తే రైతు సమస్యలపైనే గళం విప్పుతామని శాసనసభ్యులు వెల్లడించారు. కొత్తే అయినా బాధ్యత మరచిపోను: అసెంబ్లీలో మొట్టమొదటి సారిగా అడుగుపెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నియోజక వర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పోరాడతా. - ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ప్రజావాణి వినిపిస్తా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా. తొలిసారిగా గురువారం అసెంబ్లీలో అడుగిడుతున్నందున చాలా సంతోషంగా ఉంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. వాగ్దానాలన్నీ నెరవేరుస్తా. - ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆలూరు వెనుకబాటుపై గళం విప్పుతా జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో గళం విప్పుతా. మొదటి సారిగా శాసనసభ్యునిగా ఎన్నికైనా.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా అభివృద్ధికి పాటుపడతా. నగరడోణ వద్ద రిజర్వాయర్ నిర్మాణం విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. - గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే కర్నూలు రాజధాని చేయాలని కోరతా కర్నూలును రాజధాని చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలకు హాజరవుతుండటం చాలా సంతోషాన్నిస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతాప తీర్మానం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఇలాంటివి ఉండడంతో సమస్యలపై చర్చించే అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నా. ఎలాంటి అవకాశం వచ్చినా నియోజకవర్గ సమస్యలపై ప్రణాళికను రూపొందించి చర్చిస్తా. - కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడతా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి అవకాశం వస్తే నంద్యాల ప్రజల సమస్యలపై గళం వినిపిస్తా. నంద్యాల పట్టణంలోని పేద ప్రజలకు 10వేల ఇళ్లను నిర్మించడానికి స్థలాన్ని, ఇళ్లను కేటాయించాలని, పట్టణంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పందులను పట్టణ శివార్లకు తరలించాలని కోరతా. జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న శనగలకు మద్దతు ధరను కేటాయించాలని సమావేశం దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా రుణ మాఫీపై అధికార పార్టీని నిలదీసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల తరఫున పోరాటం సాగిస్తాం. - భూమానాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే మౌలికసదుపాయాలపై ప్రస్తావిస్తా నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల కల్పనపై అసెంబ్లీలో చర్చిస్తా. ప్రధాన సమస్యలు తాగునీరు, రైతులకు సాగునీరు, అలాగే రోడ్లనిర్మాణాలు, డ్రైనీజీలు, చెరువుల మరమ్మతులు, ఫించన్లు, ప్రభుత్వ గృహనిర్మాణాలు వీటితో పాటు మరెన్నో సమ్మస్యలపై ప్రస్తావిస్తా. నియోజకవర్గంలోని అన్ని సమ్మస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధుల మంజారుకు కృషి చేస్తా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు రైతులకు రుణమాఫీ ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై కమీటీ పేరుతో కాలయాపన చేయడం బాధాకరం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హామీ అమలు చేసేలా చూస్తాం. - బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే, మంత్రాలయం రైతు రుణ మాఫీపై గళం రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అవకాశం వస్తే అసెంబ్లీలో రుణాల మాఫీకి పట్టుబడతా. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పోరాడతా. వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో.. తన తండ్రి స్వర్గీయ శిఖామణి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. - మణిగాంధీ, కోడుమూరు ఎమ్మెల్యే రుణ మాఫీపై ఒత్తిడి చేస్తాం రైతులు తీసుకున్న అన్ని రకాల రుణ మాఫీ చేయాలని కోరతా. వికలాంగులకు నెలకు రూ. 1500 అందివ్వాలని, ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ఇచ్చిన హామీలు అమలుపరచే విధంగా ఒత్తిడి తీసుకొస్తా. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా. - పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నియోజకవర్గ సమస్యలపై గళం శ్రీశైల నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలను అసెంబ్లీ చర్చిస్తా. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారిగా శాసనసభలో అడుగు పెడుతున్నందున ఎంతో ఆనందంగా ఉంది. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పోరాటం సాగిస్తా. - బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైలం -
ఎమ్మెల్యేలు ఇక మాజీలు
అసెంబ్లీ రద్దుతో.. కొత్త సర్కారుకు ముందే.. జిల్లాలో తొమ్మిది మంది సర్కారు ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలనే శాసనమండలి సభ్యులు సేఫ్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పాటుకు ముందే శాసనసభ్యులు మాజీలయ్యారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక మాజీలుగానే ప్రచారం నిర్వహించుకోవాల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రాష్ట్రపతి పాలన విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రులు, విప్‌లు మాజీలు కాగా.. ఎమ్మెల్యే పదవులు మాత్రం సుప్తచేతనావస్థలో ఉన్నాయి. శుక్రవారం అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి పాలనను పొడిగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మాజీలైపోయారు. దీంతో జిల్లాలో పాలనపగ్గాలు పూర్తిగా అధికారుల చేతులకు మారనున్నాయి. అధికారికంగా పాల నా వ్యవహారాలు ఇదివరకు కూడా జిల్లా కలెక్టరే చూస్తున్నా.. ఇకపై పాల నా వ్యవహారాల్లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. ఇప్పటికే మంత్రిగా పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, విప్‌గా ఈరవత్రి అనిల్‌లు ‘మాజీ’లు కాగా... ఎమ్మెల్యే పదవులు సుప్తచేతనావస్థలో ఉన్నాయి. కేంద్ర కేబినేట్ తాజా నిర్ణయంతో సుప్తచేతనావస్థలో ఉన్న ఎమ్మెల్యే పదవులు రద్దు అయ్యాయి. 1973 అనంతరం రాష్ట్రపతి పాలన రావడం ఇదే మొదటిసారి కాగా... పోలింగ్ ముగిసి, కొత్త సర్కారు ఏర్పడక ముందే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కావడం చర్చనీయాంశం అవుతోంది. జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్న పి.సుదర్శన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, ఈరవత్రి అనిల్, ఏలేటి అన్నపూర్ణమ్మ, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణలు శనివారం నుంచి మాజీ ఎమ్మెల్యేలు కానున్నారు. మండవ వెంకటేశ్వర్రావు, అన్నపూర్ణమ్మలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా.. యెండల లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యెండలతో పాటు మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండగా, వారు నేటి నుంచి మాజీ ఎమ్మెల్యేలుగా ప్రజల్లోకి ప్రచారం కోసం వెళ్లాల్సిన పరిస్థితి. అయితే శాసనమండలి సభ్యుల పదవులు మాత్రం సేఫ్‌గా ఉండనున్నాయి. -
తెల్లబోయిన ఎర్రజెండా
మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో 1951 ఎన్నికల్లో 12 నియోజకవర్గాలు ఉండేవి. నాలుగు ఇద్దరు ప్రతినిధుల నియోజకవర్గాలు ఉండేవి. ఒక సీటు జనరల్‌కు కేటాయించగా అదే నియోజకవర్గంలో రెండవ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించేవారు. జనరల్, రిజర్వు కేటగిరీల అభ్యర్థులు ఒకేసారి పోటీలో ఉంటారు. అందరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించినవారు జనరల్ కేటగిరిలో విజేతలు అవుతారు. పోటీలో ఉన్న ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందినట్టు ప్రకటిస్తారు. ఈ ప్రకారం జిల్లాలో 12 సీట్లలో 16 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం, కాకినాడ, అమలాపురం, రాజోలు ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు. పిఠాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు విజయాలు సాధించారు. కాకినాడ, రాజమండ్రి, రాజోలు నియోజకవర్గాల్లో రిజర్వుడు అభ్యర్థులుగా కూడా కమ్యూనిస్టులే అసెంబ్లీకి వెళ్లారు. పిఠాపురం నుంచి ఆర్.వెంకట జగ్గారావు కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. రాజమండ్రి నుంచి చిట్టూరి ప్రభాకరచౌదరి కాంగ్రెస్‌కు చెందిన కె.ఎల్.నర్సింహారావుపై విజయం సాధించారు. కాకినాడ నుంచి చిత్తజల్లు వెంకట కృష్ణారావు కె.మోహన్‌రావుపై గెలుపొందారు. కాకినాడ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీకే చెందిన సాకా వెంకటరావు అసెంబ్లీకి వెళ్లారు. రాజోలు నుంచి అల్లూరి వెంకట కృష్ణారావు కిసాన్ మజ్దూర్ పార్టీ అభ్యర్థి ఆకుల బులిస్వామిపై గెలిచారు. రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లారు. కమ్యూనిస్టుల విజయ పరంపర 1955 ఎన్నికల్లో కూడా కొనసాగింది. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం నుంచి జనరల్, రిజర్వుడు అభ్యర్థులుగా ఇద్దరూ కమ్యూనిస్టులే అసెంబ్లీ గుమ్మం తొక్కారు. ఈసారి రాజమండ్రి, కాకినాడ స్థానాలు కోల్పోయి, సామర్లకోట, పెద్దాపురం, రాజోలు స్థానాల నుంచి గెలుపొందారు. రాజోలు నుంచి రిజర్వుడు అభ్యర్థిగా కూడా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి మహమ్మద్ తహసీల్ తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి శ్యామల సీతారామయ్యపై గెలుపొందారు. ద్వితీయ స్థానంలో ఉన్న సీతారామయ్య కూడా రిజర్వు అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. పెద్దాపురం నుంచి దూర్వాసుల వెంకట సుబ్బారావు తన సమీప అభ్యర్థి కృషీకార్ లోక్పార్టీకి చెందిన చల్లా అప్పారావుపై గెలుపొందారు. సామర్లకోట నుంచి పుత్సల వెంకటరావు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కృషీకార్ లోక్పార్టీకి చెందిన కాకరాల కామేశ్వరరావుపై గెలుపొందారు. రాజోలు నుంచి అల్లూరి వెంకటరామరాజు మరోసారి గెలి చారు. ప్రజాపార్టీకి చెందిన ఆకుల బాలాస్వామిపై గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి రిజర్వుడు అభ్యర్థిగా గంజి నాగేశ్వరరావు కూడా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. 1962 ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. 1967 ఎన్నికలతో వీరి శకం ముగిసింది. 1972లో సీపీఐ, సీపీఎంలు రాజమండ్రి, పెద్దాపురం, పిఠాపురం, సంపర, నగరం స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోటా గెలువలేదు. అప్పటి నుంచీ మరే ఎన్నికల్లోనూ జిల్లా నుంచి కమ్యూనిస్టులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు. జిల్లా నుంచి 1962లో అనపర్తి నుంచి పాలచర్ల పరశురామన్న కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డిపై గెలుపొందారు. చిట్టూరి ప్రభాకరచౌదరి 1967లో మరోసారి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రావుపై విజయం సాధించారు. పెద్దాపురం నుంచి ఉండవల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై విజయం సాధించారు. వీరిద్దరితో కమ్యూనిస్టుల జైత్రయాత్రకు జిల్లాలో తెర పడింది, నాటినుంచి కమ్యూనిస్టులను ప్రజా ఉద్యమకారులుగానే గుర్తించారు తప్ప ఓ రాజకీయ పార్టీగా పరిగణించి ఓట్లు వేయడం లేదు. కనీసం రెండు మూడు స్థానాలకు కూడా ఎగబాకలేని పరిస్థితికి చేరుకున్నారు. -
సభకు డుమ్మా
సాక్షి, కరీంనగర్ : ప్రస్తుత సమావేశాలను మినహాయిస్తే, 2009 నుంచి ఇప్పటివరకు శాసనసభ 12సార్లు సమావేశమయ్యింది. మొత్తం 177 రోజులపా టు సభ నడిచింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరికయినా ఫుల్ అటెండెన్స్ లేదు. వ్యక్తిగత అవసరాలో, ఇతర వ్యాపకాలో.. కారణమేదైనా సభ నడుస్తున్న సమయంలో డుమ్మా కొట్టారు. శాసనసభ్యులుగా లక్షల్లో జీతభత్యాలు పొందుతున్న వారు నాలుగున్నరేళ్లలో కేవలం 177 రోజులపాటు జరిగిన సమావేశాలకు కూడా సమయం ఇవ్వలేకపోయారు. రాష్ట్ర శాసనసభ అధికారిక సమాచారం ప్రకారం.. గైర్హాజరులో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మొదటి స్థానం ఉండగా, సిరిసిల్ల శాసనసభ్యుడు కె.తారకరామారావు రెండో స్థానంలో నిలిచారు. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. దీంతో రమేశ్, కేటీఆర్‌లతోపాటు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగర్‌రావు 2010 ఫిబ్రవరి, మార్చి నెలల్లో 31 రోజులపాటు జరిగిన సభలకు హాజరు కాలేకపోయారు. ఈ 31 రోజులను మినహాయించినా గైర్హాజరు జాబితాలో వారి స్థానం మారలేదు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అత్యధికంగా 137 రోజులు సభకు హాజరుకాగా, 134 రోజుల హాజరుతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రిగా వ్యవహరిస్తుండగా, మానకొండూరు ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ 2012 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 2012కు ముందు 119 రోజులపాటు సభ జరగగా మోహన్ 91రోజుల పాటు హాజరయ్యారు. ఆయన 28 రోజులు గైర్హాజరయ్యారు. సమస్యలు గాలికి... సభకు హాజరయిన సమయాన్ని అయినా ఎమ్మెల్యేలు వినియోగించుకోలేదన్న విమర్శలున్నాయి. 13 శాసనసభ ప్రారంభమయినప్పటి నుంచే సభను తెలంగాణ అంశం కుదిపేస్తోంది. ప్రతి సెషన్లో సభ రోజుల తరబడి వాయిదా పడుతూవచ్చింది. మిగిలిన సమయంలోనూ జిల్లా ఎమ్మెల్యేలు ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. జిల్లా రైతాంగం ఏటా తుపాన్లతో నష్టపోయినా సరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో వైఫల్యాల మీద నోరెత్తలేదు. మధ్యమానేరు, ఎల్లంపల్లి ముంపు బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోలేదు. సభలో జిల్లాకు సంబంధించి ఒక్కరైనా గట్టిగా మాట్లాడిన సందర్భంలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
నేడు YSR కాంగ్రెస్ శాసనసభ పక్షం భేటీ
-
ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ముగ్గురు ఎమ్మెల్యేల అరెస్ట్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో చర్యలకు ఉపక్రమించింది. ఉద్రేక ప్రసంగాలతో మత ఘర్షణలకు కారకులయ్యారనే ఆరోపణలపై ముగ్గురు ఎమ్మెల్యేలను శనివారం అరెస్ట్ చేయగా, మరికొందరిపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఎమ్పీ సహా మొత్తం 16 మంది నాయకులకు కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్ను మీరట్ సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే నూర్ సలీం రానాను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసు అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శుక్రవారం లక్నోలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాణాను అరెస్ట చేశారు. ఆయను ముజఫర్‌నగర్ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల కస్టడీ విధించింది.