ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముజఫర్నగర్ అల్లర్ల కేసులో చర్యలకు ఉపక్రమించింది. ఉద్రేక ప్రసంగాలతో మత ఘర్షణలకు కారకులయ్యారనే ఆరోపణలపై ముగ్గురు ఎమ్మెల్యేలను శనివారం అరెస్ట్ చేయగా, మరికొందరిపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ, బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఎమ్పీ సహా మొత్తం 16 మంది నాయకులకు కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్ను మీరట్ సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే నూర్ సలీం రానాను అరెస్ట్ చేశారు. యూపీ పోలీసు అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శుక్రవారం లక్నోలో బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాణాను అరెస్ట చేశారు. ఆయను ముజఫర్నగర్ కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల కస్టడీ విధించింది.
ముజఫర్నగర్ అల్లర్ల కేసులో ముగ్గురు ఎమ్మెల్యేల అరెస్ట్
Published Sat, Sep 21 2013 4:04 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement