భోపాల్ : వాస్తు, గ్రహదోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని విపరీతంగా విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఇటువంటి వారు అధికంగానే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందని.. అందువల్లే ప్రజాప్రతినిధులు అర్థాంతరంగా మరణిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే శాసనసభ భవానికి వాస్తు శాంతి చేయించాలని ఆయన పేర్కొన్నారు.
2013 నుంచి ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు హఠాత్తుగా మృతి చెందారని కేపీ సింగ్ చెప్పారు. ప్రస్తుత సభకు ఇంకా ఏడాది కాలపరిమితి ఉన్న నేపథ్యంలో.. ప్రకృతి మరిన్ని ప్రాణాలను కోరుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభకు రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుత విధాన సభకు శాస్త్రప్రకారం వాస్తు పూజ చేసి, ఇతర దోష నివారణ చర్యలు చేపట్టాలని కేపీసింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. 1993 నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందనే వాదనలు బలంగా విపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment