
14న ప్రమాణ స్వీకారం చేయనున్న చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈనెల 14న వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భోపాల్‌లోని జంబోరీ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సహా అగ్రనేతలు హాజరు కానున్నారు. కాగా, చౌహాన్ సోమవారం గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌కు తన రాజీనామాను సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరినట్లు చెప్పాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.