
ఎమ్మెల్యేలకు ఖరీదైన యాపిల్ ఫోన్..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ్యులందరీకి ఖరీదైన ‘యాపిల్ ఐఫోన్ 6 ప్లస్’ సెల్‌ఫోన్లు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం సభలో ప్రకటించారు.
బహుమతులను శాసనసభ సచివాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఎమ్మెల్యేలు స్వయంగా సంతకం పెట్టి తీసుకోవాలని సూచించారు. ఖరీదైన సెల్‌ఫోన్‌తో పాటు తిరుమల ప్రసాదం, అరకు కాఫీ పొడిని కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు.