
గుంటూరు, సాక్షి: లెఫ్ట్&రైట్ అప్పులు చేసే చంద్రబాబు(Chandrababu) ఏపీ అప్పులపై తప్పుడు ప్రచారం చేసి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Govt) బద్నాం చేసే ప్రయత్నం చేశారని.. కానీ కాగ్ లెక్కలు ఆ మోసాన్ని బయటపెట్టాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాడారు
2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్(budget Glance)లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్‌లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.

ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు.


Comments
Please login to add a commentAdd a comment