AP Assembly: వాడీవేడిగా మండలి సమావేశాలు | AP Assembly Budget Session 2024-25 Day 9 LIVE | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

AP Assembly: వాడీవేడిగా మండలి సమావేశాలు

కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ కాదు.. హైకోర్టు ఏర్పాటు చేయాలి: మండలిలో వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

కర్నూల్‌లో హైకోర్టునే ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల పట్టు

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

  • శ్రీబాగ్‌ ఒప్పందంలో ఏముందో మంత్రి టీజీ భరత్‌కి తెలియదా?
  • హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రజలు సంతోషిస్తున్నారు అనడం బాధాకరం
  • కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ కాదు..హైకోర్ట్‌ను ఏర్పాటు చేయాలి

హైకోర్టును కర్నూల్‌లో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టింది: ఎమ్మెల్సీ అరుణ్ కుమార్

  • ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్‌ కర్నూల్‌లో పెట్టడం ఏంటి?
     

కర్నూల్ లో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయి: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

  • కర్నూల్ లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసింది
  • అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్‌సీపీ భావించింది.

     

2024-11-21 15:16:16

శాసన మండలి వాయిదా

  • శాసన మండలిలో మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలపై దుమారం
  • మెడికల్‌ కాలేజీలపై చర్చ సందర్భంలో.. హజ్‌ యాత్ర ప్రస్తావన తేవడంపై అభ్యంతరాలు
  • వైఎస్సార్‌సీపీ ఆందోళనతో మండలి వాయిదా
  • మైనారిటీల మనోభావాలను గౌరవించాలని అంటున్న వైఎస్సార్‌సీపీ
  • మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌
2024-11-21 12:46:46

  • మండలిలో సత్యకుమార్‌ వ్యాఖ్యల‌ చిచ్చు
  • మండలిలో మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు
  • మెడికల్‌ కాలేజీలపై చర్చ సందర్భంగా గందరగోళం
  • హజ్‌ యాత్ర ప్రస్తావన తెచ్చిన మంత్రి సత్యకుమార్‌
  • మంత్రి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్‌సీపీ.. ఆగ్రహం
  • హాజ్‌ యాత్రను కించపరిచేలా ఉందన్న వైఎస్సార్‌సీపీ
  • మైనారిటీల మనోభావాలను గౌరవించాలన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
  • తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
  • మతాలను, వ్యక్తులను చర్చల్లోకి లాగడం సరికాదన్న బొత్స
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం

 


మేం ఎవరినీ కించపర్చలేదు: మంత్రి అచ్చెన్న

  • ఏ మతాన్ని దూషించలేదు
  • ఎవరినైనా నొప్పించి ఉంటే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాం

 

2024-11-21 12:42:38

పీఏసీ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్‌

  • పీఏసీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్న  మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • ఇవాళ ఒంటి గంటతో ముగియనున్న నామినేషన్ గడువు
  • నామినేషన్ దాఖలు చేసేందుకు అధికారులు కోసం ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
  • నామినేషన్ దాఖలుకు వచ్చిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు
2024-11-21 12:24:38

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిందే: వరుదు కల్యాణి

  • కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది
  • కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు
  • రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు
  • 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు
  • 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు
  • మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు
  • చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు
  • ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు
  • స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి
  • స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్
  • 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం
  • ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు,పవన్ పై ఉంది
  • ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు
  • ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు
  • కార్మికులను మోసం చేయడం చాలా దారుణం
  • చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకుంది
  • జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది
  • జగన్ మోహన్ రెడ్డి,వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్ని రకాలుగా అడ్డుకున్నారు
  • కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

2024-11-21 11:20:44

వైఎస్సార్‌సీపీ డిమాండ్‌.. శాసన మండలి వాయిదా

  • స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • స్టీల్ ప్లాంట్ పై మంత్రుల వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన
  • స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపాలంటూ స్లోగన్లు
  • విశాఖ స్టీల్‌ ప్లంట​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తక్షణ తీర్మానం చేయాలని డిమాండ్‌
  • చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఎమ్మెల్సీల నినాదాలు
  • ఈ ఆందోళన తో సభ వాయిదా వేసిన మండలి చైర్మన్
2024-11-21 10:51:29

పవన్‌ తన మాటకు కట్టుబడి ఉండాలి: బొత్స

  • స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్ తో కూడిన అంశం
  • విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు
  • మంత్రులు గత ప్రభుత్వం పై విమర్శలు చేయడం సమంజసం కాదు
  • ఈ 6 నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను 2 దఫాలుగా వేలం కి నోటిఫికేషన్ ఇచ్చారు
  • మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం లో స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కి వ్యతిరేకం అని చెప్పారు
  • ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం
  • పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి
  • మాకు ప్రయివేటికరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వెయ్యలేదు
  • మేము మా హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ జరగనివ్వలేదు

మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

2024-11-21 10:51:29

చాలా సమస్యలున్నాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం
  • మేము స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కు వ్యతిరేకం
  • దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి
  • దానికి మైన్స్ కావాలి, లాభాల్లో కి రావాలి
2024-11-21 10:51:29

కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు: YSRCP MLCs

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కు వేగంగా అడుగులు పడుతున్నాయి
  • ఉద్యోగులకు వి ఆర్ ఎస్ ఇస్తున్నారు
  • కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు
  • రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రయివేటికరణ ప్రక్రియ ఆపడానికి తీసుకున్న నిర్ణయం ఏంటి..?
  • కేంద్ర ప్రభుత్వం తో ఎందుకు మీరు ఒత్తిడి తేవడం లేదు

ఎమ్మెల్సీలు ఐవీఆర్, లక్ష్మణ రావు
 

2024-11-21 10:51:29

స్టీల్‌ ప్లాంట్‌పై YRSCP ప్రశ్న

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై వైఎస్సార్‌సీపీ ప్రశ్న


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి

3 బ్లాస్ట్ ఫర్నేష్ లలో 2 బ్లాస్ట్ ఫుర్నేష్ లు మూత పడ్డాయి

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు

పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేయిస్తారా లేదా..?

ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హామి ఇచ్చారు

కానీ ఈరోజు ప్రయివేటికరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా..?

2 ఎంపీలు ఉన్న కర్ణాటక ఉక్కు మంత్రి  ఆ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ 30 వేల కోట్లు ఆర్థిక సహాయం  తెచ్చుకున్నారు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా..?

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

 

2024-11-21 10:51:29

‘గంజాయి’పై మంత్రి లోకేష్‌ ప్రశ్న.. మంత్రి అనిత సమాధానం

ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం
గంజాయి నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం నియమించారు: మంత్రి లోకేశ్‌
గంజాయిని అరికట్టడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు : మంత్రి లోకేశ్‌
గంజాయిపై అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుతున్నా : మంత్రి లోకేశ్‌

సమాధానమిచ్చిన హోం మంత్రి అనిత..

గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు: హోంమంత్రి అనిత
ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నాం: హోంమంత్రి అనిత
యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తాం: హోంమంత్రి అనిత

గంజాయిని అరికట్టడానికి సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు: మంత్రి లోకేశ్‌

2024-11-21 10:32:04

హాట్‌ హాట్‌గా శాసనమండలి

  • వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్‌
  • సూపర్ సిక్స్ హామీల పై చర్చించాల్సిందేనన్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
  • సూపర్ సిక్స్ హామీల అమలు పై చర్చించాలి: బొత్స
  • 150 రోజుల్లో ఏం ఘన కార్యాలు చేశారో చర్చిస్తాం అంటున్నారు: బొత్స
  • చర్చకు మేం సిద్ధం: మంత్రి అచ్చెన్న
  • మండలి సమావేశాలు.. హాట్‌ హాట్‌గా సాగే అవకాశం
2024-11-21 10:14:04

మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

  • శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • సూపర్ సిక్స్ పథకాల అమలు పై చర్చించాలంటున్న వైఎస్సార్‌సీపీ
2024-11-21 09:05:44

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

9వ రోజు ప్రారంభమైన అసెంబ్లీ

 

2024-11-21 09:04:31

కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం

  • వలంటీర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం
  • వారిని కొనసాగించేది లేదని అసెంబ్లీలోనే తేల్చి చెప్పిన ప్రభుత్వం
  • ఎన్నికలకు ముందు వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ
  • ఇప్పుడేమో అసలు వలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టిన చంద్రబాబు
  • చంద్రబాబు చేసిన పచ్చి మోసంపై 2.66 లక్షల మంది వలంటీర్ల ఆందోళన
  • కరోనా కష్టకాలంలో కూడా అద్భుతంగా సేవలు అందించిన వలంటీర్లు
  • వృద్దులు, వికలాంగులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ
  • అలాంటి వలంటీర్లను తొలగించటంపై ప్రజల్లోనూ ఆగ్రహం
2024-11-21 08:53:49

నేడు అసెంబ్లీలో..

  • నేడు 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • ప్రశ్నోత్తరాల అనంతరం  శాసనసభలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
  • అనంతరం పలు పాలసీలపై ప్రకటన చేయనున్న ప్రభుత్వం
  • డ్రోన్, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపై ప్రకటన చేయనున్న సంబంధిత శాఖల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, నారా లోకేశ్
  • నేడు ఆరు బిల్లులను  శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్న ప్రభుత్వం
  • టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్ ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లపై చర్చించి ఆమోదించనున్న అసెంబ్లీ
  • రుషికొండ లో టూరిజం భావనాల తో పాటు వరద సహాయక చర్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్న శాసనసభ
2024-11-21 08:42:21
Advertisement
 
Advertisement
 
Advertisement