YS Jagan: కూటమి బడ్జెట్‌ మోసాలను నిలదీయనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Will Speak on AP 2024 Budget Today | Sakshi
Sakshi News home page

YS Jagan: కూటమి బడ్జెట్‌ మోసాలను నిలదీయనున్న వైఎస్‌ జగన్‌

Published Wed, Nov 13 2024 8:57 AM | Last Updated on Wed, Nov 13 2024 10:07 AM

YS Jagan Will Speak on AP 2024 Budget Today

గుంటూరు, సాక్షి:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నాం మీడియా ముందుకు రానున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందించనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే సూపర్‌ సిక్స్‌ హామీల ఎగవేత, సంక్షేమ లబ్ధిదారులను తగ్గించే లక్ష్యంతో బడ్జెట్‌ గణాంకాలు ఉన్నాయని.. వెరసి ఈ బడ్జెట్‌తో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని   వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు..

వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకపోగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కనీసం ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు కూడా స్పీకర్‌ మైక్‌ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారని, అలాంటప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలని జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించిన వైఎస్సార్‌సీపీ అధినేత, ఇక నుంచి మీడియా ద్వారానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా బడ్జెట్‌పై ఇవాళ ఆయన  పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

ఏపీ బడ్జెట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఇదీ చదవండి: వాళ్లపై కత్తికట్టి మరీ రాక్షసానందం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement