సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నప్పటికీ.. ఆ పార్టీ పక్క చూపులు చూస్తోందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు.
ఏపీలో మేం టీడీపీతో కలవాలనుకుంటున్నాం. కానీ, ఆ పార్టీ పక్క చూపులు చూస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ఒకవేళ.. టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం మేం సపోర్ట్ చేస్తాం అని తేల్చి చెప్పారాయన.
ఇక చంద్రబాబు అరెస్ట్.. బెయిల్‌పై విడుదల పరిణామాపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ‘‘చంద్రబాబుది అన్ అఫీషియల్ కండిషనల్ బెయిల్. బీజేపీ అగ్రనేత అమిత్ షాను నారా లోకేష్ కలిసిన తర్వాతనే పరిణామాలు మారాయి. షా వల్లనే చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు అని నారాయణ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment