CPI Narayana Satirical Comments On Jana Sena Pawan Kalyan Over NDA Alliance Meet - Sakshi
Sakshi News home page

‘పవన్‌ నిలకడ లేనోడు.. బీజేపీతో కలవడం ప్రమాదకరం’

Jul 18 2023 1:23 PM | Updated on Jul 18 2023 1:50 PM

CPI Narayana Satires On Jana Sena Pawan Kalyan NDA Alliance Meet - Sakshi

నిన్నటిదాకా చే గువేరా బట్టలేసుకుని.. ఇప్పుడు సావర్కర్‌ దుస్తులతో..  

సాక్షి, హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఇవాళ ఎన్డీయేలో ఎలా చేరుతున్నాడో చెప్పాలంటూ పవన్‌ను ఏకిపారేశాయాన.  పవన్‌ కల్యాణ్‌ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని ఆక్షేపించారు. 

‘‘పవన్‌ కల్యాణ్‌ ఒక దళారీ.. అందుకే  టీడీపీ-బీజేపీ మధ్య అనుబంధానం చేస్తున్నాడు. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదు. గతంలో పవనే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చాడు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారు? అని నారాయణ పవన్‌ను నిలదీశారు. పైగా బీజేపీతో కలవడం.. లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారాయన. 

నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పడు సావర్కర్‌ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడు. అసలు పవన్‌కు నిలకడ లేదు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్‌ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చు అని ఎద్దేశా చేశారాయన. 

ఇదీ చదవండి: కారు కూతలు.. అధమ రాజకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement