సాక్షి, తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు ఇకపై చిప్పకూడు తినాల్సిందేనని అన్నారు మంత్రి ఆర్కే రోజా. అక్రమ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అన్ని సాక్ష్యాలతో దొరికిపోయిన తర్వాత కక్ష సాధింపు చర్యలు అంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని కేసులో స్టేలు తెచ్చుకుని ఇన్నాళ్లు కాలం గడిపాడని తీవ్ర విమర్శలు చేశారు.
అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిన కేసు
కాగా, మంత్రి రోజా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగాయి. తప్పులు చేసే చంద్రబాబుకి శిక్షపడాలని దేవున్ని కోరుకున్నాను. సాక్ష్యాధారాలతో జైలుకు వెళ్లారు చంద్రబాబు. స్నేహా బారక్‌లో ప్రత్యేక గది ఇచ్చి, ఖైదీ నెంబర్ 7691ను చంద్రబాబుకు ఇచ్చారు. సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత చంద్రబాబుకి ఏర్పాటు చేశారు. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు బయట ఓవరాక్షన్ చేస్తున్నారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు.
విద్యార్థులకు నో జాబ్.. మంత్రిగా లోకేశ్..
స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ప్రజల ఉపాధి కోసం ఏర్పాటు చేసింది. అందులో అడ్డంగా దోచేశారు. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని విద్యార్థులను బాబు మోసం చేశాడు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. అది కూడా లేదు. కానీ, తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకున్నాడు. 2024లో టీడీపీకి ప్రజలకు తగిన బుద్ధిచెప్పాలని కోరుకుంటున్నాను.
సీఎం జగన్ యూత్ ఐకాన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. 2లక్షలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. మరో 2లక్షల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. 2లక్షల 60వేల మంది వాలంటీర్లను నియమించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 2లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. భారీ పరిశ్రమల ద్వారా 85వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇది యూత్ ఐకాన్ అంటే అని కామెంట్స్ చేశారు.
పైసల్లేవంటూ ప్యాలెస్ ఎలా కట్టావ్ బాబు..
కానీ, చంద్రబాబు తన కొడుకు బాగుంటే చాలని ఆయనికి మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు. చంద్రబాబు మ్యానిఫెస్టో అమలు చేయమంటే రాష్ట్రం విడిపోయింది, నష్టంలో ఉంది అని కాకికబుర్లు చెప్పేవాడు. నేడు చంద్రబాబు కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నాడు. ఇంకా అనేక స్కాముల్లో చంద్రబాబు హస్తం ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. అన్ని కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదు. నారా లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: ‘టీడీపీ బంద్ అన్నారు.. హెరిటేజ్ కూడా మూసివేయలేదు’
Comments
Please login to add a commentAdd a comment