
( ఫైల్ ఫోటో )
విజయవాడ: ఇన్నర్‌రింగ్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్‌రింగ్ స్కాంలో ఇప్పటికే నారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ. దీనికి సంబంధించి నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.
ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్
ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది.
చదవండి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ అక్రమాల కేసు.. పీటీ వారంట్!
Comments
Please login to add a commentAdd a comment