Bigg Boss 5 Telugu Episode 17 Highlights: లోబో అసభ్యంగా తాకాడన్న ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌ - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: లోబో అసభ్యంగా తాకాడన్న ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌

Published Wed, Sep 22 2021 2:16 AM | Last Updated on Wed, Sep 22 2021 4:09 PM

Bigg Boss Telugu 5: Priyanka Singh Feels Lobo Behave Indecent With Her - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 17: నామినేషన్స్‌తో హౌస్‌లో కార్చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్‌. ఈ నామినేషన్‌ ప్రక్రియతో కంటెస్టెంట్ల మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసేందుకు వినోదాత్మకమైన టాస్క్‌ ఇచ్చాడు. అయినప్పటికీ హౌస్‌లో నెలకొన్న అశాంతి ఛాయలు పూర్తిగా కనుమరుగైనట్లు కనిపించలేదు. మరి నేటి(సెప్టెంబర్‌ 21) నాటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో చదివేద్దాం..

నామినేషన్‌లో ఐదుగురు
జెస్సీ.. మానస్‌, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో మాస్టర్‌, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్‌ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ ఫైర్‌ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్‌.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను; కాజల్‌.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్‌ మాస్టర్‌, ప్రియను నామినేట్‌ చేశారు. ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్‌, శ్రీరామ్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

ప్లేటు ఫిరాయించిన రవి, ఏడ్చేసిన ప్రియ
'యాంకరింగ్‌ కోసం లహరి ట్రై చేస్తుంది, అందుకని నాతో ఉంటుంది. కానీ ఆమె పెళ్లికాని అమ్మాయి కదా! నేను ఆమెతో చెప్పలేకపోతున్నానని రవి ప్రియతో అన్నారట' అని పింకీ లహరితో చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంతుందో తెలుసుకుందామని రవితో భేటీ అయింది లహరి. 'నేను యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తున్నాను అని, అందుకే నీ పనులు చేసి పెడుతున్నాను అని అన్నావట, ఇక్కడ పెళ్లి కాని వాళ్లు చాలామంది ఉన్నారు. తనకెలా చెప్పాలో తెలియడం లేదు అని అన్నావా?' అని నిలదీసింది. దీనికి రవి అడ్డంగా తలూపుతూ అబ్బే ఆ మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. కానీ ప్రియ మాత్రం.. 'లహరి సింగిల్‌గా ఉన్న అబ్బాయిలను వదిలేసి నాతోనే ఉంటుంది, నేను ఏమీ అనలేకపోతున్నాను అని రవి అన్నాడు' అని బల్లగుద్ది చెప్తూనే ప్రియ ఏడ్చేసింది. అయితే రవి మాత్రం తను ఆ మాటే అనలేదని కరాఖండిగా చెప్పాడు. నిజంగానే నువ్వు ఆ మాట అన్నావు బ్రో, అది నేను విన్నానంటూ ప్రియ వెక్కివెక్కి ఏడ్చేసింది.

సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు: పింకీ
మరోవైపు ప్రియాంక సింగ్‌.. లోబో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కాజల్‌, సిరి దగ్గర వాపోయింది. 'నిన్న హాఫ్‌ ఫిట్‌ డ్రెస్‌ వేసుకున్నాను. అది కొంచెం అన్‌ కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ వీలైనంతవరకు కవర్‌ చేసుకుంటూనే ఉన్నాను. అక్కడ నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నన్ను చూసి సైగలు చేశాడు. నాకర్థమైంది. నా కవరింగ్‌ నేను చేసుకుంటున్నాను. అంతలో సడన్‌గా వచ్చి చేయి పెట్టాడు. ఫన్నీగానే తీసుకున్నాను, కానీ వెంటనే డ్రెస్‌ మార్చేసుకున్నాను' అని చెప్తూ బాధపడింది. ఇది విని షాకైన కాజల్‌.. ఇంకోసారి ఇలా చేయకు అని లోబోకు సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వాల్సిందని ఆగ్రహించింది. పక్కనే ఉన్న సిరి.. ఈ విషయాన్ని రవికి చెప్తా అనడంతో పింకీ వదిలేయండి అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన లోబో ప్రియాంకక్‌ హగ్‌ ఇచ్చి వెళ్లాడు.

కుమిలి కుమిలి ఏడ్చిన ప్రియ
హౌస్‌లో అందరూ తనను టార్గెట్‌ చేయడంతో ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చింది ప్రియ. 'నువ్వేదైతే నేర్పించావో అలాగే ఉన్నానమ్మా.. ఏదీ కల్పించి చెప్పలేదు. ఒక్క ముక్క కూడా అబద్ధం చెప్పలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు' అంటూ తల్లిని గుర్తు చేసుకుని బాధపడింది. ఆ తర్వాతి రోజు ప్రియ.. తన గుండెలోని భారాన్ని దింపేసుకుంటూ లహరికి సారీ చెప్పింది. మీ అందరి రియాక్షన్‌ చూశాక నేను తప్పు విధానంలో చెప్పానని అర్థమైందని ప్రాయశ్చిత్తపడింది.

ఫన్‌ టాస్క్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌
తర్వాత బిగ్‌బాస్‌.. హౌస్‌మేట్స్‌కు 'హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్‌ ఇచ్చాడు. హైదరాబాద్‌ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది. అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్‌ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్‌ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా,  విశ్వ అబ్బాయి పర్సనల్‌ అసిస్టెంట్‌గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్‌ మ్యారేజ్‌ బ్రోకర్‌గా, లోబో ఈవెంట్‌ మేనేజర్‌, శ్వేత లోబో అసిస్టెంట్‌, హమీదా.. అబ్బాయి ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్‌, మానస్‌ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్‌ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు. ఈ టాస్క్‌ రేపటి ఎపిసోడ్‌లో కంటిన్యూ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement