Bigg Boss 5 Telugu: Priya Interview After Elimination In Bigg Boss Buzz - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: రవి చేతిలో ఎలిమినేషన్‌, కాజల్‌ టాప్‌ 5లో ఉండకూడదు.. ప్రియ

Published Mon, Oct 25 2021 6:55 PM | Last Updated on Tue, Oct 26 2021 9:59 AM

Bigg Boss Telugu 5: Priya Elimination Interview With Ariyana Glory - Sakshi

Bigg Boss 5 Telugu, Priya Elimination Interview: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాపులర్‌ కంటెస్టెంట్‌ ప్రియ. అదరకుండా, బెదరకుండా గేమ్‌ ఆడే ప్రియ ఒకే ఒక్క గొడవతో ఎలిమినేట్‌ అయిపోయింది. ఒక టాస్కులో సన్నీని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ నోరు జారడం, అనవసరంగా కయ్యం పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనను బిగ్‌బాస్‌ ప్రేక్షకులు సమ్మతించలేకపోయారు. ఫలితంగా అప్పటిదాకా ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్లిన ప్రియ ఆ ఒక్క ఎపిసోడ్‌తో కిందకు పడిపోయింది. వెరసి.. ఏడోవారం బిగ్‌బాస్‌ హౌస్‌కు గుడ్‌బై చెప్పేసింది. 

తాజాగా ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. యాంకర్‌ రవి గురించి చెప్తూ.. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయగలడని తెలిపింది. 'రవితో కలిసి గేమ్‌ ఆడినవాళ్లు ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నారో, మరేంటో తెలీదు కానీ నెక్స్ట్‌ వీక్‌ వాళ్లు పక్కా ఎలిమినేట్‌ అవుతున్నారు, ఎందుకు?' అని ప్రశ్నించింది అరియానా. దీనికి ప్రియ బదులిస్తూ.. అందుకే అతడిని వెరీ కన్నింగ్‌, వెరీ స్మార్ట్‌ అంటుంటాను. 'ఎవరెవరు స్ట్రాంగో, వాళ్లను పంపించే ప్లాన్‌లో ఉన్నాడు రవి' అని అతడి గేమ్‌ను బయటపెట్టింది.

కాజల్‌ గేమ్‌ప్లాన్‌కు అందరూ భయపడాల్సిందేనన్న ప్రియ ఆమె టాప్‌ 5లో ఉండకూడదని కోరుకోవడం గమనార్హం. 'ఒక వ్యక్తిని టార్గెట్‌ చేయాలనుకుంటే వారి అంతు చూసేంతవరకు వదలరా?' అని అరియానా సూటిగా ప్రశ్నించగా 'అది నా గేమ్‌ ప్లాన్‌' అంటూ తెలివిగా బదులిచ్చింది ప్రియ. స్టేజీమీద షణ్ముఖ్‌ను ఆకాశానికెత్తేసిన ప్రియ ఇంటర్వ్యూలో మాత్రం అతడు భయంకరమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. అతడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని పేర్కొంది.

సిరి మాట్లాడేదంతా ఫేకే అని, ఆమె మాటలేవీ తనకు నచ్చవని చెప్పింది. సిరి గేమ్‌ కోసం ఏదైనా చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రియాంకను దూరం పెడితే ప్రేక్షకులు ఏం అనుకుంటారోనని మానస్‌ ఆమెను భరిస్తున్నాడా? అని అరియానా క్వశ్చన్‌ చేయగా.. అదంతా ఫేక్‌ అని తేల్చే పారేసింది ప్రియ. మొత్తానికి ఈ ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. అయితే ప్రియ బిగ్‌బాస్‌ స్టేజీపై మాట్లాడినదానికి, బజ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడినదానికి పొంతనే లేదంటూ షాక్‌ అవుతున్నారు నెటిజన్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement