బిగ్‌బాస్‌: ఆ ఇద్దరు చేసిన తప్పుకు లహరి బలి కానుందా?! | Bigg Boss 5 Telugu: Lahari Shari In Danger Zone In Third Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రవి, ప్రియల తప్పుకు లహరి శిక్ష అనుభవించాల్సిందేనా?

Published Thu, Sep 23 2021 9:31 PM | Last Updated on Fri, Sep 24 2021 12:24 AM

Bigg Boss 5 Telugu: Lahari Shari In Danger Zone In Third Week - Sakshi

Bigg Boss 5 Telugu, 3rd Week Elimination: బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్‌ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. నామినేషన్స్‌లో ప్రియ చేసిన కామెంట్ల మీద ఇప్పటికీ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కేవలం లహరి తనతో ఉండట్లేదన్న బాధతో.. ఆమె అబ్బాయిలతో బిజీగా ఉందని, అలాంటప్పుడు అమ్మాయిలతో ఉండటానికి టైం ఎక్కడుంటుందని నోటికొచ్చినట్లు మాట్లాడింది. అదీకాకుండా రాత్రిపూట వాష్‌రూమ్‌ దగ్గర యాంకర్‌ రవికి హగ్గివ్వడం కళ్లారా చూశానంటూ దాన్నో పెద్ద బూతుగా చిత్రీకరించింది. అనాల్సిందంతా అన్నాక తాను చెప్పిన విధానం కరెక్ట్‌ కాదంటూ లహరికి సారీ చెప్పి చేతులు దులిపేసుకుంది.

అయితే ఇక్కడ ప్రియ ఒక్కరిదే తప్పు కాదు, యాంకర్‌ రవిది కూడా ఉంది. నామినేషన్స్‌ కన్నా ముందు అతడు ప్రియ దగ్గర లహరి గురించి కొంత బ్యాడ్‌గా చెప్పాడు. లహరి యాంకర్‌ అవడానికి ప్రయత్నిస్తోందని, అందుకే తన పనులన్నీ చేసి పెడుతోందని, ఇంట్లో సింగిల్‌ మెన్‌ (పెళ్లికాని అబ్బాయిలు) ఉన్నా కూడా తన వెంటే తిరుగుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని ప్రియ దగ్గర వాపోయాడు. కానీ తర్వాత మాత్రం సింగిల్‌ మెన్‌ అనే మాటే తన నోటి నుంచి రాలేదంటూ ప్లేటు ఫిరాయించాడు. అటు ప్రియ కూడా.. వీరిద్దరి వ్యవహారాన్ని పెద్ద ఇష్యూ చేసి మిడ్‌నైట్‌ హగ్గు అంటూ ఓ అమ్మాయి గురించి దారుణంగా మాట్లాడి పెద్ద తప్పే చేసింది. అయితే రవి, ప్రియ చేసిన తప్పులకు లహరికి శిక్ష పడేలా కనిపిస్తోంది.

ఈ వారం నామినేషన్స్‌లో మానస్‌, ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్రతో పాటు ప్రియ, లహరి నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రతి సమస్యను ఎంతో కూల్‌గా డీల్‌ చేస్తున్న మానస్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. అటు శ్రీరామ్‌కు సపోర్ట్‌ చేసే ఫ్యాన్స్‌ కూడా చాలామందే ఉన్నారు. తనంతట తానుగా ఏ గొడవలోనూ దూరకుండా ఉంటున్న ప్రియాంక సింగ్‌కు కూడా బాగానే ఓట్లు గుద్దుతున్నారు. మిగిలిందల్లా ప్రియ, లహరి. నామినేషన్స్‌ జరిగినరోజు ప్రియ మీద తీవ్రమైన ట్రోలింగ్‌ జరిగింది. కానీ రవి.. లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు రావడంతో ప్రియపై కాస్త నెగెటివిటీ తగ్గింది. ఎటొచ్చీ లహరికి అంతగా ఫ్యాన్‌ బేస్‌ లేకపోవడంతో ఆమె డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ​కానీ లహరికి సానుభూతి ఓట్లు పడితే మాత్రం ఆమె కచ్చితంగా సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది. మరి ఓటర్లు ప్రియకు సపోర్ట్‌ చేస్తారా? లేదా లహరిని హౌస్‌లో కొనసాగనిస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement