Bigg Boss Telugu 5, Nominations: బిగ్‌బాస్ మూడోవారం 'వాల్ ఆఫ్ షేమ్' అనే నామినేషన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఎవరైతే ఈ షోలో కొనసాగడం అనవసరం అనుకుంటారో వారి పేరును బద్ధలు కొడుతూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ పోటాపోటీగా నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ల పేర్లను ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ క్రమంలో లహరి.. ప్రియను నామినేట్ చేసింది. మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. దీనికి ప్రియ బదులిస్తూ.. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్న అందరు అబ్బాయిలతో బిజీగా ఉన్నావు, కాబట్టి! అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ప్రియకు వార్నింగ్ ఇచ్చిన రవి
ఆమె సమాధానం విని షాకైన లహరి.. ఎవరితో ఉన్నానో చెప్తారా? అని అడిగింది. ఇందుకామె రవి, మానస్‌తో బిజీగా ఉన్నావని చెప్పింది. ప్రియ మాటలు విని షాకైన రవి.. సిరిన ఉదాహరణగా చెప్తూ.. ఆమెను ఒక ఫ్రెండ్‌లాగా, సోదరిలాగా భావిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మధ్యలోనే అడ్డుకున్న ప్రియ.. ఇప్పుడు మీరు అందరి దగ్గరా సపోర్ట్ ఆశించకండి అని కౌంటరిచ్చింది. ఆమె మాటలతో తల పట్టుకున్న రవి.. అలాంటి రాంగ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వొద్దంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చాడు. అటు లహరి కూడా మరోసారి తనలోని అర్జున్‌రెడ్డి యాంగిల్‌ను బయటపెడుతూ.. నా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని హెచ్చరించింది.
ప్రియ కంటే ఉమాదేవి నయం!
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ప్రియలో సెకండ్ యాంగిల్ బయటపడింది, అప్పుడు సన్నీ, ఇప్పుడు లహరి మీద తన అక్కసు వెళ్లగక్కింది, ఈవిడ కంటే ఉమాదేవి 100 రెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. బహుశా ఆమె చెప్పింది నిజమే కావచ్చేమో కానీ చెప్పిన విధానం బాగోలేదంటున్నారు మరికొందరు. ప్రియ ఇలాగే ఇతర కంటెస్టెంట్లను చులకన చేస్తే మాట్లాడితే ఈ వారం వెళ్లిపోవడం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ గొడవ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసిపోతారా? లేదా ప్రియ, లహరి మధ్య వైరం కొనసాగనుందా? అనేది చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment