
బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్లు మహాముదుర్లులా ఉన్నారు. చాలామంది పక్కా ప్రణాళికతో హౌస్‌లో అడుగు పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తే కెమెరాల్లో కనిపిస్తాం? ఎలా వ్యవహరిస్తే ఆడియన్స్‌ను బుట్టలో వేసుకోవచ్చు అన్న విషయాల్లో పీహెచ్‌డీ చేసినట్లు కనిపిస్తున్నారు. అందుకే హౌస్‌లో ఇలా అడుగు పెట్టారో లేదో అప్పుడే గొడవలు షురూ చేశారు. కొందరైతే కావాలని కన్నీళ్ల కుళాయిని విప్పుతూ ఎమోషనల్ డ్రామా పండించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నార జనాలు. ఇక ఇప్పటికే హౌస్‌లో లవ్ యాంగిల్‌ను కూడా పరిచయం చేశాడు బిగ్‌బాస్.
అందరినీ అన్నయ్య అని పిలుస్తానన్న ప్రియాంకసింగ్(పింకీ) మానస్‌ను మాత్రం అలా పిలవలేనని బాహాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటిది పింకీని ఓరగా చూశాడు లోబో. ఈ మేరకు గురువారం ఓ ప్రోమో రిలీజైంది. నువ్వు నన్ను చూస్తున్నావని మానస్‌కు ఫిర్యాదు చేస్తాను. నీకు దమ్ముంటే మానస్ ముందు లైనేయ్ అంది ప్రియాంక. దీంతో షాకైన లోబో.. నేను ప్రియాంకు ప్రపోజ్ చేద్దామనుకుంటే ఆమె ముందు నీతో మాట్లాడమంది అని చెప్తూ మానస్‌కు దండం పెట్టేశాడు.
ఇక పవర్ యాక్సెస్ టాస్క్‌లో విశ్వ, మానస్, సిరి తర్వాత హమీదా గెలుపొందింది. అయితే తనకు బిగ్‌బాస్ టఫ్ టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యుల్లో ఒకరు ఎప్పటికీ కెప్టెన్ కాకుండా ఎంచుకోవాలన్నాడు. దీంతో అయోమయంలో పడిపోయిన హమీదా నటి ప్రియ పేరు చెప్పినట్లు లీకైంది. అసలే కెప్టెన్సీ అనేది ఓ ఆపన్నహస్తం వంటిది. ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి దీన్ని మించిన అస్త్రం లేదు. అలాంటిది ఎప్పటికీ కెప్టెన్ అవలేరు అంటే అది నిజంగానే భారీ మైనస్‌గా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment