కెరీర్‌ వర్సెస్‌ లవ్‌! | A film about how hard work and love are in the success of both. . | Sakshi
Sakshi News home page

కెరీర్‌ వర్సెస్‌ లవ్‌!

Published Wed, Jun 28 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

కెరీర్‌ వర్సెస్‌ లవ్‌!

కెరీర్‌ వర్సెస్‌ లవ్‌!

లవ్, కెరీర్‌ రెండింటిలో ఒకేసారి సక్సెస్‌ అవ్వడం కాస్త కష్టం. అసాధ్యం మాత్రం కాదు. అయితే లవ్, కెరీర్‌ రెండింటిలో సక్సెస్‌ అయ్యేందుకు కొందరు యువతీయువకులు ఎలా కష్టపడ్డారన్న అంశానికి వినోదాన్ని జోడిస్తూ ఓ సినిమా రూపొందుతోంది. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో స్టోన్‌ మీడియా ఫిలిమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలో శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అభిలాష్, ప్రియ జంటగా ఆకెళ్ళ పెరి శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌ విక్టరీ’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘1990లలో, 2000లలో పుట్టినవాళ్లను మిల్లెనియన్స్‌ అంటారు. నేటి తరంలో ఎక్కువ మంది కెరీర్, లవ్‌ల మధ్య సంఘర్షణ పడుతుంటారు. ఇదే కాన్సెప్ట్‌ని బేస్‌ చేసుకుని తీస్తున్న రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది.


ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తూ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాను. పిల్లలు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. శరత్‌ మరార్‌గారు కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. శరత్‌ గురవగరి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. పాటలు అలరిస్తాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు శ్రీనివాస్‌కు సినిమా అంటే ప్యాషన్‌. కథలో ఎవ్రీ సీన్‌ను డెవలప్‌ చేస్తారు. సినిమాలోని పాత్రలు కెరీర్‌ అండ్‌ లవ్‌ని ఎలా బ్యాలెన్స్‌ చేసుకున్నాయన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శరత్‌ మరార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement