Sarat Mararar
-
కొత్త నాగశౌర్యను చూస్తారు
నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, శరత్‌మరార్, రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్రావుగార్లతో కలిసి నాగశౌర్యతో సినిమా నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, శరత్ మరార్గారి కాంబినేషన్లో నా సినిమా ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్ రెండో చిత్రమిది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ఊహాజనిత బయోపిక్‌లా ఉంటుంది. నాకు మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇందులో సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు సంతోష్ జాగర్లపూడి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి. -
కెరీర్ వర్సెస్ లవ్!
లవ్, కెరీర్ రెండింటిలో ఒకేసారి సక్సెస్ అవ్వడం కాస్త కష్టం. అసాధ్యం మాత్రం కాదు. అయితే లవ్, కెరీర్ రెండింటిలో సక్సెస్ అయ్యేందుకు కొందరు యువతీయువకులు ఎలా కష్టపడ్డారన్న అంశానికి వినోదాన్ని జోడిస్తూ ఓ సినిమా రూపొందుతోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ సంస్థలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిలాష్, ప్రియ జంటగా ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ విక్టరీ’ అనేది వర్కింగ్ టైటిల్. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘1990లలో, 2000లలో పుట్టినవాళ్లను మిల్లెనియన్స్ అంటారు. నేటి తరంలో ఎక్కువ మంది కెరీర్, లవ్ల మధ్య సంఘర్షణ పడుతుంటారు. ఇదే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని తీస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రమిది. ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తూ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాను. పిల్లలు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. శరత్ మరార్‌గారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. శరత్ గురవగరి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. పాటలు అలరిస్తాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు శ్రీనివాస్‌కు సినిమా అంటే ప్యాషన్. కథలో ఎవ్రీ సీన్‌ను డెవలప్ చేస్తారు. సినిమాలోని పాత్రలు కెరీర్ అండ్ లవ్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాయన్నది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శరత్ మరార్.