
ప్రేమలో కొత్త కోణం
ప్రేమ అనే రెండక్షరాలకు ఆకర్షణ శక్తి అధి కం. దానికి చాలా కోణాలున్నాయి. ఎన్ని విధాలుగా చూపించినా వెగటు అనిపించనిది ప్రేమ ఒక్కటే. అందుకే సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్నా అందులో
ప్రేమ అనే రెండక్షరాలకు ఆకర్షణ శక్తి అధి కం. దానికి చాలా కోణాలున్నాయి. ఎన్ని విధాలుగా చూపించినా వెగటు అనిపించనిది ప్రేమ ఒక్కటే. అందుకే సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్నా అందులో ప్రేమ సజీవంగా, నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంది. సినిమా అనే మూడక్షరాల పదం వినిపిస్తున్నంత వరకు ప్రేమ అనే రెండక్షరాల పదం ప్రకాశి స్తూనే ఉంటుంది. ప్రేమను కొందరు గుడ్డిదంటారు. మరి కొందరు పిచ్చిదంటారు. ఎవరెలా అన్నా ప్రేమ ఎవర్ గ్రీనే. అలాంటి ప్రేమ కథను వినూత్నంగా కాదల్ పైత్తియం పేరుతో తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు మాచంద్రు. ఇంతకు ముందు కన్నడంలో బంగారి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిస్తున్న తొలి చిత్రం కాదల్ పైత్తియం.
అమ్మా ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై సి.దశరథ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉత్తరాది నటుడు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈయన హిందీలో ఎ దిల్ రాంతా జోగి అనే చిత్రంలో హీరోగా నటించారు. ఇక హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ జీవిక పరిచయం అవుతున్నారు. ఈమె కన్నడంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఆడుగళం నరేన్, వైజీ మహేంద్రన్, ప్రియ, తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ హీరో హీరోయిన్ల మధ్య ఏర్పడిన ప్రేమకు ఎలాంటి ఆటంకాలూ ఉండవన్నారు.
ఇరు కుటుంబాల వారు పచ్చ జెండా ఊపుతారని చెప్పారు. అయినా వారి ప్రేమకు కాస్త గ్యాప్ వస్తుం దన్నారు. అందుకు కారణాలేమిటి? చివరికి ప్రేమికులు ఒకటయ్యారా? అన్న పలు ఆసక్తి కరమైన అంశాల సమాహారంగా కాదల్ పైత్తియంను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించి ఊటీ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతా ల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్.పి.వర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి బీఆర్ విజయన్ ఛాయాగ్రహణం నెరపుతున్నారు.