
Bigg Boss 5 Telugu Promo: నామినేషన్స్‌తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సందడి చేసే వీకెండ్ ఎపిసోడ్స్ బిగ్‌బాస్ షోను మరింత రసవత్తరంగా మారుస్తాయి. అందుకే చాలామంది వారంలో ఏ ఎపిసోడ్ మిస్ అయినా నామినేషన్, ఎలిమినేషన్‌ను మాత్రం అస్సలు మిస్సవరు. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ వారాంతాల్లో వచ్చే ఎపిసోడ్లను కన్నార్పకుండా చూస్తారు.
తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించాడు నాగ్. ఈ వారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఆదేశించాడు. దీంతో సిరి.. నిర్మొహమాటంగా కాజల్ పేరు చెప్పింది. శ్రీరామ్... మానస్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నాను, కానీ కాదనిపిస్తోందన్నాడు. అతడి మాటలతో ఏకీభవించని మానస్.. తాను సొంతంగా ఆడట్లేదంటే ఒప్పుకోనని తెగేసి చెప్పాడు.
ఇక ఫిజికల్ టాస్కుల్లో వైల్డ్‌గా ఆడుతున్నాడని ప్రియ విశ్వ పేరు సూచించింది. అయితే విశ్వ.. తాను నెట్టలేదని పేర్కొన్నాడు. లేదు, అతడు తనను నెట్టేశాడంటూ వాదించింది ప్రియాంక. దీంతో ఈ విషయంలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది క్లారిటీ ఇచ్చేందుకు వీడియో చూపిస్తానన్నాడు నాగ్. ఇక సన్నీ.. ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. ఈ మాటకు ఆవేశపడాల్సింది పోయి ప్రియ సన్నీని ప్రేమగా పిలుస్తూ గాల్లో ముద్దులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment