
Bigg Boss 5 Telugu,Episode 16: కంటెస్టెంట్ల అసలు రంగును బయటపెట్టేది నామినేషన్సే. ఈ నామినేషన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఈ ప్రక్రియ వాడివేడిగానే జరిగింది. నామినేట్ చేసే క్రమంలో ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగారు. కొందరైతే నోరు కూడా జారారు. వాళ్లెవరు? నేటి(సెప్టెంబర్ 20) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం..
డబ్బులు లేక స్కూల్‌లో జాయిన్ చేయించలేకపోయా: విశ్వ
సన్నీ మంచోడే కానీ పని దొంగ, అటు హమీదా పని చేయదు కానీ ఆర్డర్లు వేస్తుంది అని చిరాకు పడ్డాడు మానస్. నాగార్జున ఆదేశం మేరకు మటన్ బిర్యానీకి అవసరమైన సరుకులన్నింటినీ బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాడు. కానీ అది కాజల్ మాత్రమే వండాలని మెలికపెట్టడంతో ఆమె గరిటె పట్టక తప్పలేదు. విశ్వ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చేముందు లాక్‌డౌన్‌లో తన పరిస్థితి ఎలా ఉందో షణ్ముఖ్ దగ్గర గోడు వెల్లబోసుకున్నాడు. భార్య, కొడుక్కు ఏమైనా కొందామంటే డబ్బుల్లేవని, నాలుగు నెలల అద్దె కూడా కట్టలేదని ఎమోషనల్ అయ్యాడు. కొడుకును స్కూల్‌లో జాయిన్ చేయడానికి వెళ్తే డబ్బులు తక్కువున్నాయని సీట్ రాలేదు అని ఏడ్చాడు. దీంతో షణ్ముఖ్ అతడిని ఓదార్చాడు.
21 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో మునకేసిన షణ్ముఖ్
హౌస్‌లో షణ్ముఖ్ పట్టపగలు నిద్రపోవడంతో కెప్టెన్ విశ్వ అతడికి కఠిన శిక్ష విధించాడు. స్విమ్మింగ్ పూల్‌లో 21 సార్లు దూకాలని చెప్పడంతో షణ్ను తనకు విధించిన శిక్షను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా కంటెస్టెంట్లు వాళ్లు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పేరును టైల్ మీద ముద్రించి దాన్ని పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా శ్రీరామ్.. మానస్, రవిని; సిరి.. శ్వేత, లహరిని నామినేట్ చేశారు. మీరన్న మాట తీసుకోలేకపోయానంటూ సన్నీ.. ప్రియను నామినేట్ చేయగా వాటే సేఫ్ ప్లే అంటూ చప్పట్లు కొట్టింది. తర్వాత సన్నీ.. కాజల్‌ను నామినేట్ చేశాడు.
నేను రిలేషన్ కోసం రాలే, సరిగ్గానే ఆడుతున్నా: జెస్సీ కౌంటర్
అనంతరం నటరాజ్ మాస్టర్ వంతు రాగా.. గేమ్‌లో నా వీపు మీదెక్కి కూర్చుందని, ముఖం మీద కూడా గట్టిగా ప్రెస్ చేసింది, అంతేకాకుండా చాలాసార్లు వాడు, వీడు అని మాట్లాడటం విన్నానంటూ సిరిని, సెల్ఫిష్ అంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటూ శ్రీరామ్, మానస్‌లను నామినేట్ చేసింది. యాంకర్ రవి.. చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపిస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందని, ఇప్పటికైనా గేమ్ ఆడంటూ జెస్సీని నామినేట్ చేశాడు. దీనికి అతడు రియాక్ట్ అవుతూ తాను పర్ఫెక్ట్‌గా గేమ్ ఆడుతున్నానని, ఎలాంటి రిలేషన్ కోసం రాలేదని కౌంటరిచ్చాడు.
నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు
అనంతరం లహరి.. ప్రియను నామినేట్ చేయగా ఇది కదా సేఫ్ గేమ్ అని ఆమె పెదవి విరించింది. అసలు మీరు నాతో ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని లహరి అడగ్గా.. ఎందుకంటే నువ్వు హౌస్‌లో అందరు అబ్బాయిలతో బిజీ కాబట్టి! అబ్బాయిలతో నీకు ఏ ప్రాబ్లమ్ లేదు, కానీ అమ్మాయిలతోనే అసలు ప్రాబ్లమ్ అని వెటకారంగా ఆన్సరిచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్నవాళ్లంతా షాకయ్యారు. తర్వాత ప్రియ శ్రీరామ్ పేరున్న ప్లేట్‌ను పగలగొట్టింది.
నువ్వు అబ్బాయిలతో బాగా బిజీ: ప్రియ
లోబో.. ప్రియాంక సింగ్, శ్రీరామ్‌ను; ప్రియాంక సింగ్.. లోబో, జశ్వంత్‌ను; మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశారు. ప్రియ.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లహరి కోసం చూశానని, కానీ ఆమె నా దగ్గరకు రాలేదని, ఎందుకంటే ఇంట్లో మగవాళ్లతో బిజీగా ఉందని మరోసారి అదే మాటను నొక్కి చెప్పింది. ఒకసారైతే రాత్రి రెస్ట్ రూమ్‌లో రవికి హగ్గిస్తూ కనిపించావంది. దీంతో చిర్రెత్తిపోయిన లహరి.. జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి అని మండిపడింది.
మిడ్‌నైట్ హగ్గు అనడం ఎంతవరకు కరెక్ట్: మండిపడ్డ రవి
రవి బ్రదర్ బర్త్‌డే కోసం షర్ట్ పంపించమని కెమెరాల దగ్గర రిక్వెస్ట్ చేశానని, అతడు తనకు బ్రో మాత్రమేనంటూ ఏడ్చేసింది లహరి. తర్వాత రవి మాట్లాడుతూ.. మిడ్‌నైట్ హగ్గు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. నేను లహరి కంటే సిరి, కాజల్‌తో ఎక్కువగా ఉంటాను, అప్పుడు లేని సమస్య లహరి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుంది? మమ్మల్ని అందరినీ దోషులుగా చూపిస్తున్నావు అని కడిగి పారేశాడు. దీనికి ప్రియ బదులిస్తూ.. ఆమె సింగిల్, ఏదైనా చేయగలదు అని మరోసారి ఆమె క్యారెక్టర్‌ను నిందించేలా కామెంట్ చేయడంతో లహరి ఆవేశంతో ఊగిపోయింది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ వార్నింగ్ ఇచ్చింది.
మనిషికి హగ్గిస్తే బూతు కాదు: సన్నీ
మాకు ఫ్యామిలీస్ ఉన్నాయని, రాంగ్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నావంటూ ప్రియ మీద ఒంటికాలిపై లేచాడు రవి. నా బిడ్డకు ఈ స్టేట్‌మెంట్ అర్థమైతే ఎలా ఉంటుంది? మీకూ పిల్లలు ఉన్నారు కదా! అని ఆవేదన చెందాడు. ఈ గొడవతో మరింత హీటెక్కిపోయిన ప్రియ.. లహరి పేరును టైల్‌పై ముద్రించి దాన్ని కసితీరా పగలగొట్టింది. తర్వాత సన్నీని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా సన్నీ.. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని హితవు పలికాడు. అలా హగ్గివ్వడం తప్పని తాను అనలేదని, కేవలం చూసింది చెప్పానంటూ ప్రియ గొంతు చించుకుని అరిచినా ఆమెను పట్టించుకునేవాళ్లే లేకుండా పోయారు. ఈ నామినేషన్ రచ్చ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment