
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు 18 టీఆర్పీ వచ్చింది. ఈ లాంచింగ్ ఎపిసోడ్‌కు అతిథులెవరూ రాకపోయినా, సినిమా హీరోయిన్ల డ్యాన్సులు లేకపోయినా, కంటెస్టెంట్లలో చాలావరకు కొత్తముఖాలున్నా కింగ్ నాగార్జున మాత్రం తనదైన హోస్టింగ్‌తో జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. అటు కంటెస్టెంట్లు కూడా దొరికించే చాన్స్ అన్నట్లుగా హౌస్‌లో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్‌ను రఫ్ఫాడిస్తున్నారు.
తాజాగా ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ 'బాల్ పట్టు, లగ్జరీ బడ్జెట్ కొట్టు' టాస్క్ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లెవరూ బంతిని పట్టుకోలేకపోయినట్లు చూపించారు. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవాలని ఆదేశించాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆ వరస్ట్ పర్ఫామర్ సన్నీ అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అతడి అభిమానులు బిగ్‌బాస్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగా ఆడేవాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా, హౌస్‌మేట్స్ అందరూ కలిసి అతడిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు హౌస్‌లో మరోసారి కాజల్ గొడవపడింది. ఏదో విషయం గురించి ఆమె ప్రియతో మాట్లాడగా అది కాస్తా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అబద్ధం కూడా చాలా అందంగా చెప్తావంటూ కాజల్‌ను నిందిస్తూ ప్రియ ఆమెకు చేతులెత్తి మొక్కింది. అసలు వీళ్ల మధ్య గొడవెందుకు మొదలైంది? నిజంగానే సన్నీ వరస్ట్ పర్ఫామరా? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment