Bigg Boss 5 Telugu: Nagarjuna Play Video Proof For Lahari - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: లహరి కళ్లు తెరిపించిన నాగ్‌, దోషిగా యాంకర్‌ రవి!

Published Sat, Sep 25 2021 4:45 PM | Last Updated on Sat, Sep 25 2021 5:49 PM

Bigg Boss 5 Telugu: Nagarjuna Play Video Proof For Lahari - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడోవారం జరిగిన నామినేషన్స్‌ వల్ల ఈసారి ఎలిమినేషనే తలకిందులయ్యేలా ఉంది. ప్రియ, యాంకర్‌ రవి వల్ల లహరి బ్యాడ్‌ అయింది. యాంకర్‌ రవి ఆడిన డబుల్‌ గేమ్‌ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్‌ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్‌ రవి.. ప్రియతో నామినేషన్స్‌ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. 'ఆమె యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తుంది. కానీ 'సింగిల్‌ మెన్‌'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అని వాపోయాడు.

దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ లహరి మీద ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్‌రూమ్‌ దగ్గర హగ్‌ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్‌లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ 'నువ్వు మగాళ్లతోనే బిజీ' అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్‌ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్‌ మెన్‌ అనే మాటే అనలేదని ప్లేటు ఫిరాయించాడు. నువ్వు అన్నావు కదా అని ప్రియ నిలదీసినప్పటికీ తను మాత్రం అనలేదని బుకాయించాడు. ప్రియ తనను బ్యాడ్‌ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్‌ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది.

ఇక వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్‌ మెన్‌ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే 'అన్నాను సర్‌' అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్‌ అని చెప్పింది. తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి నాగ్‌.. లహరికి ఆమె గురించి రవి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement