
Actor Priya In Bigg Boss 5 Telugu: ప్రియ అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. 1998లో వచ్చిన మాస్టర్ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది. హీరోహీరోయిన్లకు అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని.. ఇలా పలు సహాయక పాత్రల్లో ఒదిగిపోయిన ప్రియ సుమారు 60 సినిమాల్లో నటించింది. బుల్లితెర, వెండితెర.. కాదేదీ వినోదానికి అనర్హం అన్నట్లుగా రెండుచోట్లా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియ ఇప్పటివరకు ఎలాంటి వివాదంలో తలదూర్చకపోవడం ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెప్తోంది. 2002లో కిషోర్‌ను పెళ్లాడిన ఆమెకు నిశ్చయ్ అనే కుమారుడున్నాడు. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అంటోంది ప్రియ. గొడవలకు దూరంగా ఉండే ఈ నటి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదే నియమాన్ని పాటిస్తుందా? తన సహనంతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంటుందా? అన్నది చూడాల్సిందే.