Akhil Sarthak Supports Priya: బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో తన ప్రవర్తనతో ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు అఖిల్ సార్థక్. అలాగే మోనాల్‌తో నడిపిన లవ్ ట్రాక్ కూడా అతడిని బాగానే ఫేమస్ చేసింది. అఖిల్-సోహైల్-మెహబూబ్‌ల ఫ్రెండ్‌షిప్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్.. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఓ వెబ్ సిరీస్‌తో పాటు 'ఫస్ట్ టైమ్' అని ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా వుంటే అఖిల్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఐదో సీజన్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సీజన్‌లో తను ఏ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా వెల్లడించాడు.
శైలజా ప్రియ... అదేనండీ నటి ప్రియకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమెకు సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టాడు. 'ఈ సీజన్ మొత్తానికి తను కెప్టెన్ కాలేకపోయినా టాస్కుల్లో మాత్రం తన బెస్ట్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మీరు ఫైటర్ అన్న విషయం తెలుసనుకోండి.. అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ..' అంటూ మద్దతు పలికాడు. నటి ప్రియకు ఓట్లేయమంటూ అభిమానులకు పిలుపునిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment