
యానీ మాస్టర్‌కు పంతం ఎక్కువ. అవసరం లేని విషయాల్లో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎవరైతే డేంజర్ అనుకుంటుందో వాళ్లతో...
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే గదిలో నిద్రిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలిసే ఉంటూ, కలిసే పని చేస్తూ, కలిసే తింటున్నప్పుడు ఒకరి గురించి మరొకరికి ఏదో ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది. ఎవరు ఎలాంటివాళ్లు? ఎవరు మామూలుగా ఉన్నారు? ఎవరు నటిస్తున్నారు? ఎవరు పక్కా ప్లానింగ్‌తో షోలోకి వచ్చారు? అన్న విషయాలను ముందే పసిగడుతుంటారు. నటి ప్రియ కూడా కంటెస్టెంట్ల గురించి రివ్యూ ఇచ్చింది. అన్‌సీన్ వీడియోలో ఉమాదేవి, లహరితో కలిసి ముచ్చట్లు పెట్టిన ప్రియ కంటెస్టెంట్లందరి గురించి చెప్పుకొచ్చింది.
అతడికి ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలుసు
మొదటగా.. సన్నీ గురించి చెప్తూ 'తనకు అన్నీ తెలుసనుకుంటాడు, కానీ కొంతే తెలుసు. మానస్ సైలెంట్‌గా అందరినీ గమనిస్తూనే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు గట్టిగా రియాక్ట్ అవుతాడు. నటరాజ్ మాస్టర్.. అందరూ తన మాట వింటున్నాడని ఫీలవుతాడు. కానీ కొన్నే వింటాం.. ఇక లోబో విషయానికి వస్తే.. సడన్‌గా నిద్ర లేచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రవికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది తెలుసు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎక్కడ తగ్గాలో? ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఇక కాజల్.. ఆమెకు అన్నీ తెలుసేమో అనుకున్నా ఇక్కడ అవేమీ పని చేయవు. తను మెచ్యూర్డ్ అనుకుంటుంది కానీ అస్సలు కాదు' అని చెప్పింది ప్రియ.
మచ్చిక చేసుకోవాలనుకుంటోంది
'26 ఏళ్ల వయసున్న సిరి చాలా స్మార్ట్. యానీ మాస్టర్‌కు పంతం ఎక్కువ. అవసరం లేని విషయాల్లో ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎవరైతే డేంజర్ అనుకుంటుందో వాళ్లతో మరోలాగా ఉంటుంది. శ్వేత వర్మ.. ఎవరేం అడిగినా కాదనుకుండా చేసి పెడుతుంది. అందరినీ మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అది ఆమె స్వభావమో, ఏమో తెలియదు. ఆటలో మాత్రం ఆమె చాలా స్ట్రాంగ్'
సరయూ స్ట్రాంగ్, హమీదా తెలివైంది
'ప్రియాంక చాలా మంచి అమ్మాయి. గేమ్ ఎలా ఆడాలి? ఎవరితో ఎలా సర్దుకుపోవాలి? అనేది బాగా తెలుసు. అన్ని ఆటుపోట్లు తట్టుకుని ఇక్కడిదాకా వచ్చింది. విశ్వ.. సింపతీ గేమ్ ప్లే చేస్తున్నాడనిపిస్తుంది. సరయూ మంచి అవగాహనతో, స్ట్రాంగ్‌గా ఇక్కడికి అడుగుపెట్టింది. హమీదా చాలా తెలివైంది' అని పేర్కొంది. అందరి మీదా రివ్యూ ఇచ్చిన ప్రియ ఈ అభిప్రాయాలు ఏ క్షణమైనా మారే అవకాశముందని చివర్లో ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం.