నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత | MY DAUGHTER IS MY PRIORITY: SUDEEP | Sakshi
Sakshi News home page

నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత

Published Sun, Sep 13 2015 12:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత

నా కూతురికే నా మొదటి ప్రాధాన్యత

అమెంటే నాకు ప్రత్యేకం... ఆమెకే నా మొదటి ప్రాధాన్యం ... ఆమెను విపరీతంగా ప్రేమిస్తాను ... అని 11 ఏళ్ల తన గారాల పట్టి, కుమార్తె శాన్వీ గురించి ప్రముఖ నటుడు సుదీప్ తెలిపారు. ప్రియా, తనకు విడాకులు తీసుకున్నా శాన్వీతో తన అనుబంధంలో మార్పు ఉండదని  ఆయన స్పష్టం చేశారు. సుదీప్, కేరళకు చెందిన ప్రియా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. సుదీప్ చిత్రాల్లో నటిస్తుంటే ... ప్రియా బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమలోపడ్డారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రియను సుదీప్ వివాహం చేసుకున్నాడు.

2004లో వీరికి శాన్వీ జన్మించింది. మొదట్లో సుదీప్ ఇబ్బందులు పడ్డా... ఆ తర్వాత పుంజుకున్నారు. ఇటీవల వరుస సినిమాల ఆఫర్లు వస్తుండటంతో సుదీప్ తెగ బిజీ అయ్యారు. అయితే 2009 - 10లో సుదీప్పై వుకార్లు వెల్లువెత్తాయి. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రియా కుమార్తె శాన్వీతో కలసి బెంగుళూరులోని జేపీ నగర్లో సర్జాపుర్ రహదారి సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తుంది. సుదీప్ నుంచి తనకు విడాకులు ఇప్పించాలంటూ ప్రియా ఈ ఏడాది ఆగస్టులో కోర్టును ఆశ్రయించింది. ఇద్దరి అంగీకారంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.    

శాన్వీ మైనర్ కాబట్టి ఆమె బాధ్యతులు తల్లి ప్రియా చూసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే విడాకులు నేపథ్యంలో ప్రియకు రూ. 19 కోట్ల రూపాయిలు భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ ఒప్పుకున్నాడని సమాచారం. భరణంపై సుదీప్ను విలేకర్లు ప్రశ్నించారు. నేను చేస్తున్నదంతా నా కుమార్తె... నా భార్య కోసమే కాదా అని సింపుల్గా సుదీప్ చెప్పేశాడు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం ద్వారా సుదీప్ దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement