
Bigg Boss 5 Telugu Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో కెప్టెన్సీ పోటీ జరుగుతోంది. హౌస్‌లో ఎవరు కెప్టెన్ అవుతారన్నదానిపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు యువరాజులైన రవి, సన్నీ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కసితో రగిలిపోతున్నారు. వీరిద్దరిలోని ఏ రాజ్యంలో ఎక్కువ నాణాలు ఉంటే ఆ ఆస్థానంలోని ప్రజలే కెప్టెన్సీకి పోటీపడే అర్హత సాధిస్తారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో యువరాజు రవి టీమ్ గెలిచిందట! దీంతో రవి, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ కెప్టెన్సీకి పోటీపడ్డట్లు సమాచారం. హమీదా చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే చివరగా ప్రియ పోటీలో గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు లీకులు వినిపిస్తున్నాయి. నిజానికి గతంలో హమీదాకు ఓ పవర్ లభించింది. దీనిద్వారా ఆమె ఎంపిక చేసుకునే కంటెస్టెంట్ ఎప్పటికీ కెప్టెన్ కాలేరని బిగ్‌బాస్ వెల్లడించాడు. ఇందుకు హమీదా.. సీనియర్ నటి ప్రియ పేరు సూచించింది. దీంతో ఈ సీజన్ మొత్తంలో ప్రియకు కెప్టెన్ అయ్యే అవకాశమే లేదని, దాని వల్ల లభించే ఇమ్యూనిటీ కూడా ఆమెకు దక్కదని ప్రకటించాడు బిగ్‌బాస్. కానీ తాజాగా ప్రియ కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బిగ్‌బాస్ చరిత్రలోనే ఈ కెప్టెన్సీ రికార్డుకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్ ఆమెను కెప్టెన్‌గా ఒప్పుకోకపోతే ఆ పదవిని ప్రియ వేరే ఎవరికైనా అప్పగించే అవకాశమూ లేకపోలేదు!
Comments
Please login to add a commentAdd a comment