తండ్రి మరణాన్ని తట్టుకుని.. | Survive the death of the father .. | Sakshi
Sakshi News home page

తండ్రి మరణాన్ని తట్టుకుని..

Published Sat, Mar 29 2014 4:02 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

తండ్రి మరణాన్ని తట్టుకుని.. - Sakshi

తండ్రి మరణాన్ని తట్టుకుని..

బంగారుపాళెం, న్యూస్‌లైన్: కన్నతండ్రి మరణంతో తల్ల డిల్లి పోయిందా బాలిక. అయినా బాధను తట్టుకుని పదోతరగతి పరీ క్షకు హాజరైంది. రాగిమానుపెంట గ్రామానికి చెందిన ప్రియ స్థానిక జె డ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.

శుక్రవారం ఆమె పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలోనే పిడు గులాంటి వార్త... తండ్రి శివయ్య విద్యుత్ షాక్‌తో మరణించాడని సమాచారం.   కుంగిపోయిన ప్రియ గుండెలవిసేలా విలపించింది. కన్నతండ్రి విద్యుత్ షాక్‌కు గురై చనిపోయిన బాధను దిగమింగి శుక్రవారం జరిగిన పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్షకు హాజరైంది. తండ్రి మరణాన్ని తట్టుకుని పబ్లిక్ పరీక్షకు హాజరై చదువుపై ఇష్టాన్ని చాటింది.
 
విద్యుత్ షాక్‌తో మృతి
 
గురువారం అర్ధరాత్రి మండలంలో ని బోడబండ్ల సీజేఎస్‌ఎఫ్ కాలనీ వద్ద విద్యుత్ షాక్‌తో శివయ్య మర ణించాడు. రాగిమానుపెంట గ్రామానికి చెందిన పురుషోత్తంనాయుడుకు చెందిన బోరు మోటారు రిపేరు చేసే జీపు క్రేన్ బండికి అదే గ్రామానికి చెందిన ఎం.శివయ్య ఆపరేటరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సీజేఎస్‌ఎఫ్ కాలనీలో పంచాయతీ బోరు మోటారు అమర్చేందుకు వెళ్లారు.

బోరుబావిలో నుంచి మోటారు బయటకు తీస్తుండగా పక్కనే 11కేవీ విద్యుత్ తీగలకు రోప్ తగిలింది. దీంతో క్రేన్ ఆపరేటరు శివయ్య(40) కరెంటు షాక్‌కు గురై మృతి చెందా డు. పోలీసులు మృతదేహాన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి చిన్న కుమార్తె ప్రియ. పెద్ద కుమార్తెకు రెండు నెలల్లో పెళ్లి కావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement