బిగ్‌బాస్‌: ప్రియ సేఫ్‌, లహరి ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 5 Elimination: Lahari Shari May Be Eliminated This Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ నుంచి లహరి అవుట్‌!

Published Sat, Sep 25 2021 8:24 PM | Last Updated on Sun, Sep 26 2021 1:54 PM

Bigg Boss Telugu 5 Elimination: Lahari Shari May Be Eliminated This Week - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో మరో కంటెస్టెంట్‌ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈ వారం శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్‌, మానస్‌ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ దొరకడంతో పాటు ఎలాంటి నెగెటివిటీ కూడా లేకపోవడంతో ఈ ముగ్గురూ ఈవారం సేఫ్‌ అయినట్లే! మిగిలిందల్లా లహరి, ప్రియ.

నిజానికి ప్రియ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే ఆమె ఎలిమినేట్‌ అవడం ఖాయం అనుకున్నారంతా! ఒక అమ్మాయి గురించి అందరి ముందు బ్యాడ్‌గా మాట్లాడటంతో ప్రియపై నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కూడా ఒక మహిళే కదా, అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది? రాత్రిపూట హగ్గులంటూ బూతుగా ఎలా చిత్రీకరించగలిగింది? అని ఆక్రోశించారు నెటిజన్లు.

కానీ ఎప్పుడైతే రవి.. ఇంట్లో సింగిల్‌మెన్‌ (పెళ్లికానివాళ్లు) ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది. రవి వల్లే ప్రియ అలా మాట్లాడాల్సి వచ్చిందని పలువురూ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ ఇద్దరు చేసిన తప్పులకు లహరి బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వారం లహరి ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ లేడీ అర్జున్‌రెడ్డికి నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆఖరి రోజు కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement