
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల సంఖ్య తగ్గేకొలదీ హౌస్‌మేట్స్ మధ్య పోటీ ఉత్కంఠగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్స్ రోజు వారి నిజస్వరూపాలు బయటకు వస్తాయి. అయితే ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియను వెరైటీగా నిర్వహించాడు బిగ్‌బాస్. ముగ్గురు వేటగాళ్ల చేతిలో నామినేషన్ ప్రక్రియను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ టాస్క్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ చిందులు తొక్కుతోందీ ప్రియాంక.
ఆరు వారాల నుంచి నామినేట్ అవుతున్నానని, ఈసారికి వదిలేయమని సన్నీని వేడుకున్నాడు రవి. ఇక సిరి.. మానస్‌ను, షణ్ముఖ్... యానీ మాస్టర్‌ను నామినేట్ చేయగా కాజల్.. ప్రియ పేరు చెప్పింది. ఇది విన్న ప్రియ.. ఇది ఊహించిందేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ వారం లోబో, శ్రీరామ్, ప్రియ, యానీ, రవి, కాజల్, జెస్సీ, సిరి నామినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment