పోలీస్ స్టేషన్లో అమ్మాయి వీరంగం | Girl creates ruckus at a Police station in Kukatpally | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్లో అమ్మాయి వీరంగం

Published Tue, Mar 15 2016 9:51 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

పోలీస్ స్టేషన్లో అమ్మాయి వీరంగం - Sakshi

పోలీస్ స్టేషన్లో అమ్మాయి వీరంగం

మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు, ఓ యువతి శనివారం రాత్రి హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారు.

 పోలీసులపై తిరగబడ్డ యువతీ యువకులు

హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు, ఓ యువతి శనివారం రాత్రి హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాకు లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే...హైదర్నగర్లో ఉంటున్న కౌశిక్, వంశీ అనే యువకులు మద్యం తాగి అనంతరం సీసాలను పక్క ఇంటిపైన పడేశారు. దీంతో యువకులకు, స్థానికులకు మధ్య స్వల్ప వివాదం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు యువకులిద్దరినీ పోలీస్ వాహనంలో ఎక్కించుకోని స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన వీరి స్నేహితులు తరుణ్, ప్రియ అనే యువతి పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ స్నేహితులను అకారణంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని వాగ్వివాదానికి దిగారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో ఆ యువతిని నిలువరించేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు. ఈ సంఘటన మొత్తం వీడియో తీసి గోప్యంగా ఉంచాలని స్థానిక పోలీసులు ప్రయత్నించారు. అయితే సోమవారం లీక్ అయిన ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కౌశిక్, తరుణ్, వంశీ, ప్రియలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement