హైవేల వెంట పచ్చదనం.. | Mission green highways agriment with NGHM | Sakshi
Sakshi News home page

హైవేల వెంట పచ్చదనం..

Published Fri, Nov 11 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

హైవేల వెంట పచ్చదనం..

హైవేల వెంట పచ్చదనం..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్‌లో భాగంగా పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను నిర్మించేందుకు నడుం బిగించింది. హైవేలకు ఇరువైపుల పెద్ద ఎత్తున చెట్లను పెంచుతారు. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐతో ఐటీసీ గురువారం న్యూఢిల్లీలో చేతులు కలిపింది. ఐటీసీకి చెందిన పేపర్‌బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం ఈ  ప్రాజెక్టును అభివృద్ధి చేస్తుంది.  పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రాంతాలను ఏపీలో గుర్తించారు. కర్నూలు నుంచి కడప మధ్య ఎన్‌హెచ్-40లో 114 కిలోమీటర్ల మేర 100 హెక్టార్లలో పేపర్ తయారీకి అవసరమైన చెట్లను పెంచుతారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు రహదారిలో ఎన్‌హెచ్-44పై 149 కిలోమీటర్లలో 100 హెక్టార్లలో ఈ ప్రాజెక్టును చేపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement