
ట్రాఫిక్ ఇక్కట్లపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి ట్రాఫిక్ ఇక్కట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులు తొలగేలా రోడ్ల పరిస్థితిని తక్షణం మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా 100 కిలోమీటర్ల మేర మెరుగైన రోడ్లు, సిమెంట్ పరిశ్రమలతో కలిసి వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, వెడల్పయిన రోడ్లు, మళ్లీ మళ్లీ తవ్వకుండా డక్ట్ల నిర్మాణం చేపడతామని కేసీఆర్ వెల్లడించారు.