
పాస్‌పోర్టు కేంద్రాలుగా 40 పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పాస్‌పోర్టుల జారీని సులభతరం చేసేందుకు పోస్టల్, విదేశాంగ శాఖలు చేతులు కలిపాయి. ఎంపిక చేసిన 40 పోస్టాఫీసులు.. పాస్‌పోర్టు సేవలను అందించనున్నాయి. పోస్టల్ శాఖ అధికారులకు సంబందిత శిక్షణనిచ్చి పోస్టాఫీసును పాస్‌పోర్టులకు ‘సింగిల్ పాయింట్ సెంటర్’గా మార్చనున్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద తొలిదఫాలో బుధవారం కర్ణాటకలోని మైసూరు, గుజరాత్‌లోని దాహోద్‌లలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతీ జిల్లా హెడ్‌పోస్టాఫీసులో ఇలాంటి కేంద్రం ఏర్పాటుచేయాలనే యోచన ఉందన్నారు.