
ఫేస్‌బుక్ లోగో
సాక్షి, బెంగళూరు: డేటా బ్రీచ్ నేపథ్యంలో ఫేస్‌బుక్ దేశంలో దిద్దుబాటు చర్యలకు దిగింది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో సోషల్‌మీడియా దిగ్గజం ముందు జాగ్రత్త చర్యలకు సమాయత్తమైంది. తన ఫ్లాట్‌ఫారమ్‌పై నకిలీ వార్తలను నిరోధించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. భారత్ లో 217 బిలియన్లకుపై యూజర్లను కలిగి వున్న ఫేస్‌బుక్ రానున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఈ కీలక చర్యను చేపట్టింది. ఒక పైలట్ ప్రోగ్రాం ద్వారా ఫేక్‌న్యూస్‌ను అరికట్టేందుకు రంగంలోకి దిగింది.
2018, మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్వతంత్ర డిజిటల్ జర్నలిజం సంస్థ బూమ్‌తో కలిసి పైలట్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రకటించింది. థర్‌పార్టీ ఫాక్ట్ చెకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు బ్లాగ్ స్పాట్‌లో తెలిపింది. దీని ద్వారా ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. ఒక కథనాన్ని తప్పుగా రేట్ చేస్తే, దాన్నిన్యూస్ ఫీడ్లో లోయర్ చేసిన చూపుతామని, అలాగే ఈ నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు యూజర్లకు, పేజీ అడ్మిన్స్ నోటిఫికేన్ పంపుతామని తెలిపింది.
తద్వారా పదేపదే తప్పుడు వార్తలను షేర్ చేస్తున్న పేజీలు, డొమైన్లకు షేరింగ్ తగ్గుతుంది. దీంతోపాటు వాణిజ్య ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్ వర్క్, పోయింటర్ చేత ధృవీకరించబడిన బూమ్ తో భాగస్వామాన్ని కుదుర్చుకున్నట్టు తెలిపింది. దీని ద్వారా ఆంగ్ల భాషా వార్తా కథనాలను ఫ్లాగ్ చేసి, వాస్తవాలను తనిఖీ చేసి, వాటి ఖచ్చితత్వాన్ని అంచనా వేయినున్నట్టు చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఫేస్‌బుక్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి.