![132 Seats Bus Nitin Gadkari Pilot Project Details](/styles/webp/s3/article_images/2024/07/4/nitin-gadkari-132-seats-bus.jpg.webp?itok=KoLLQt1-)
భారతదేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణంగా ప్రతివ్యక్తి సొంతంగా వాహనం కలిగి ఉండాలనుకోవడమే. ఓ ఇంట్లో నలుగురు జనాభా ఉంటే.. నలుగురికీ నాలుగు కార్లు ఉంటాయి. చాలామంది ప్రజా రవాణా ఉపయోగించడమే పూర్తిగా మానేశారు కూడా. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' పైలట్ ప్రాజెక్ట్ మొదలైనట్లు వెల్లడించారు.
ఇటీవల ఇన్‌ఫ్రాశక్తి అవార్డుల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గడ్కరీ రాబోయే 132 సీట్ల బస్సు గురించి వివరించారు. ఈ బస్సులలో విమానం మాదిరిగా ఉండే సీట్లు, ఎయిర్ హోస్టెస్ మాదిరిగానే 'బస్ హోస్టెస్' ఉంటారని వెల్లడించారు. ఇంధనం తక్కువగా వినియోగించుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకున్నట్లు, భవిష్యత్తులో భారత్ ఇంధన దిగుమతిదారుగా కాకుండా.. ఎగుమతిదారుగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఇంధన వినియోగం తగ్గించడానికి ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా.. 300 ఇథనాల్ పంపులను ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ప్రజా రవాణా ఖర్చును తగ్గించడానికి కూడా ప్రభుత్వం మార్గాలను అన్వేషితోందని గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సు ఒక కిమీ నవ్వడానికి 115 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 41, నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రూ. 37 మాత్రమే ఖర్చు అవుతుంది. నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు.. టికెట్ ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మేము టాటాతో కలిసి నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. నేను చెక్ రిపబ్లిక్‌కు వెళ్ళినప్పుడు.. అక్కడ మూడు ట్రాలీలు ఉన్న బస్సు చూశాను. అలాంటిదే ఇండియాలో కూడా రోపొందించాలని అనుకున్నాను. రాబోయే ఎలక్ట్రిక్ బస్సు 132 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 40 సెకన్లలో 40 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జింగ్ వేసుకుంటుంది. దీనికోసం అయ్యే ఖర్చు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment