టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫాస్ట్‌ట్యాగ్ విధానం తొలగించడానికి ప్రధాన కారణం 'జీపీఎస్' బేస్డ్ విధానం అమలులోకి రావడమే. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
త్వరలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి, దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. అంతకంటే ముందు దేశంలో ఈ జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను అమలులోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు సమాచారం.
2021లో ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించనున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే?
జీపీఎస్ బేస్డ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment