ఫీజులు కట్టలేక పిల్లల్ని కడతేర్చాడు.. | Poverty forces father to kill 2 children in karnataka | Sakshi
Sakshi News home page

ఫీజులు కట్టలేక పిల్లల్ని కడతేర్చాడు..

Published Mon, Feb 22 2016 1:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ఫీజులు కట్టలేక పిల్లల్ని కడతేర్చాడు..

ఫీజులు కట్టలేక పిల్లల్ని కడతేర్చాడు..

బెంగళూరు:  కర్ణాటక కేపీ అగ్రహారలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి పిల్లల పట్ల కాలయముడిలా మారిపోయాడు. స్కూలు ఫీజులు కట్టే విషయంలో భార్యతో గొడవపడ్డ శివకుమార్.. కన్నబిడ్డల్నే దారుణంగా హతమార్చాడు. వారిని దుస్తులతో కట్టేసి, కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికంగా బీభత్సాన్ని సృష్టించిన ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

పనీపాటా లేకుండా ఆవారాగా తిరిగే శివకుమార్ తరచు భార్య తాయమ్మతో గొడవపడేవాడు. తాజాగా పిల్లల స్కూలు ఫీజు విషయంలో భార్యతో ఘర్షణకు దిగాడు. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే తాయమ్మ బయటకు వెళ్లాక.. అన్నెంపున్నెం ఎరుగని  చిన్నారులు పవన్ (8), సించన (4) పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.  పిల్లలిద్దరినీ  కట్టేసి మరీ పొడిచి హత్యచేశాడు. అనంతరం గోనెసంచుల్లో కుక్కి ఇంటి వెనకాల నిర్జనప్రదేశంలో పడేసి అక్కడినుంచి పారిపోయాడు. పని నుంచి ఇంటికి తిరిగివచ్చిన తల్లి తాయమ్మ బిడ్డలు కనిపించకపోవడంతో శివకుమార్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.  దీంతో  కంగారు పడిన ఆమె బంధువులకు సమాచారం అందించింది.  ఈ  క్రమంలో శివకుమార్  అఘాయిత్యం బయటపడింది.  పిల్లల మృతదేహాలను గుర్తించిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.  బంధువుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, శివకుమార్ ను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement