పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.
పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. హయత్‌నగర్ మండలం లకా్ష్మరెడ్డిపాలెం గ్రామంలోని కాండోర్ షేన్ స్కూల్ యాజమాన్యం ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఆగ్రహించిన ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాలలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తె లుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.