
సాక్షి, వికారాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన గురించి తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ముందుగానే విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చదవండి: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం
Comments
Please login to add a commentAdd a comment