mallareddy engineering college
-
హాస్టల్ పైనుంచి దూకి బీటెక్ స్టూడెంట్ మృతి, వీడియో వైరల్
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్‌లోచంద్రిక అనే ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో యువతి నాలుగో సంవత్సరం చదువుతోంది. చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ. కాగా ప్రస్తుతం మైసమ్మగూడలోని కృప వసతి గృహంలో ఉంటోంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి చంద్రిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా యువతి చంద్రిక ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై డీసీపీ పద్మజ మాట్లాడుతూ..'కృప హాస్టల్ పక్కన యువతి మృతదేహాం ఉందని మంగళవారం ఉదయం 8.15 కి స్థానిక కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. యువతిని మిర్యాలగూడకు చెందని చంద్రికగా గుర్తించాం. ఆమెకు బాక్‌ల్యాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా తర్వాత ఇటీవల సీటీకి వచ్చిన చంద్రిక ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంది. చదువులో వెనకబడి ఉన్నానన్న మసస్తాపంతో యువతి బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్నాం. సీసీ కెమెరాలు, చంద్రిక ఫోన్ డేటా పరిశీలిస్తున్నాం'అని ఆమె పేర్కొన్నారు. చదవండి : పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి.. నాలుగు నెలల్లోనే... వయసు 26.. కేసులు 20 -
మల్లారెడ్డి కాలేజీ ముందు విద్యార్థుల ఆందోళన
-
కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఆగ్రహం
సాక్షి, వికారాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన గురించి తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ముందుగానే విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చదవండి: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం -
అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం
సాక్షి, కుత్బుల్లాపూర్: నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, పేట్‌బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు అఖిల్, శశాంక్, వేణు బైక్‌పై వెళుతుండగా మహారాష్ట్రకు చెందిన ఓ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. అఖిల్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన శశాంక్, వేణును స్థానిక బాలాజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అఖిల్ సికింద్రాబాద్ వాసిగా గుర్తించారు.